యాక్టివా జోరుకు చెక్ పెట్టేందుకు హీరో స్ప్లెండర్ ఉత్పత్తి రెట్టింపు

By Ravi

హోండా యాక్టివా నుంచి ఎదురవుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు హీరో మోటోకార్ప్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే, కంపెనీ తమ స్ప్లెండర్ ఉత్పత్తిని దాదాపుగా రెట్టింపు చేసే పనిలో ఉంది. హోండా యాక్టివా ఇప్పటికే రెండు సార్లు (సెప్టెంబర్ 2013లో ఒకసారి, మార్చ్ 2014లో మరోసారి) భారతదేశంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న స్ప్లెండర్ అమ్మకాలను అధిగమించిన సంగతి తెలిసినదే.

హోండా ఇటీవల ప్రవేశపెట్టిన స్ప్లెండర్ ఐస్మార్ట్ బైక్‌కు మంచి డిమాండ్ వస్తుండటంతో ఈ మోడల్ ఉత్పత్తిని నెలకు 800 యూనిట్ల నుంచి 1200 యూనిట్లకు పెంచనున్నారు. అలాగే 100సీసీ స్ప్లెండర్ ప్రో, స్ప్లెండర్ ప్లస్ మరియు 125సీసీ సూపర్ స్ప్లెండర్ మోడళ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచనున్నారు. ఈ మోడళ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వీటి వెయిటింగ్ పీరియడ్ తగ్గించి అమ్మకాలు పెంచుకోవాలని హీరో మోటోకార్ప్ యోచిస్తోంది.

Hero MotoCorp

క్యూ4లో క్షీణించిన లాభం
ఇదిలా ఉండగా మార్చి 31, 2014తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో (క్యూ4లో) హీరో మోటోకార్ప్ నికరలాభం 3.45 శాతం క్షీణించి రూ.554.43 కోట్లుగా నమోదయ్యింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ.574.23 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సమయంలో అమ్మకాలు 6.3 శాతం పెరిగి రూ. 6455.70 కోట్లుగా ఉండగా, అంతకు ముందు సంవత్సరం ఇవి రూ.6,074.47 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తంగా 2014తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ నికరలాభం స్వల్పంగా తగ్గి రూ.2,109.08 కోట్లకు పరిమితం కాగా, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలోరూ.2,118.16 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Friday, May 30, 2014, 10:02 [IST]
English summary
Hero MotoCorp, India's largest two wheeler manufacturer, has decided to ramp up production of its Splendor models to cater to increased demand and to fend off Honda's resilient automatic scooter, the Activa.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+