హీరో మోటోకార్ప్ నుంచి 600సీసీ స్పోర్ట్స్ బైక్..

By Ravi

ఇటీవలే డీజిల్‌తో నడిచే మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించిన దేశీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్, తాజాగా మరో అద్భుతాన్ని భారత్‌కు పరిచయం నుంది. హీరో మోటోకార్ప్ నుంచి 500సీసీ సామర్థ్యానికి ఎగువన ఓ సరికొత్త స్పోర్ట్స్ బైక్‌ మార్కెట్లోకి రానుంది.

కంపెనీ వర్గాల సమాచారం ప్రకారం, హీరో మోటోకార్ప్ రేపటి (ఫిబ్రవరి 5, 2014) నుంచి ప్రారంభం కానున్న 12వ ఎడిషన్ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఓ సరికొత్త 600సీసీ బైక్‌ను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఈ స్పోర్ట్స్ బైక్‌కు 'హస్టర్' (Hastur) అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం.

Hero MotoCorp Hastur 600cc Sportsbike

ఇప్పటికే హీరో మోటోకార్ప్ హస్టర్ 600సీసీ స్పోర్ట్స్ బైక్‌కు సంబంధించిన ఫొటో ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తుంది (పైన చూపించిన ఫొటో). కెటిఎమ్ డ్యూక్ మోడళ్లను తలపించేలా డిజైన్ చేసిన ఈ కాన్సెప్ట్ ఫొటోను బట్టి చూస్తుంటే, ఇది షార్ప్ డిజైన్‌ను, యల్లో కలర్ పెయింట్ వర్క్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

హీరో మోటోకార్ప్ హస్టర్ స్పోర్ట్స్ బైక్‌ను అంతర్జాతీయ మార్కెట్ల కోసం తయారు చేసినట్లు, ఇండియాలో కూడా దీనిని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ బైక్‌కు సంబంధించిన మరింత సమాచారం తెలియాలంటే, ఇంకొన్ని గంటలు వేచి ఉండక తప్పదు. ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు సంబందించిన అన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, February 4, 2014, 12:33 [IST]
English summary
Hero MotorCorp is not done surprising us yet. Last week, the world's largest two wheeler manufacturer revealed the HX250R quarter liter sports bike and the RNT Concept diesel two wheeler. According to an ET report, the next big reveal that's being saved for the Expo is a 600cc naked motorcycle named Hastur.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+