హీరో హెచ్ఎక్స్250ఆర్ విడుదల జాప్యం; అక్టోబర్‌లో రావొచ్చు!

By Ravi

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ గడచిన సంవత్సరం ఆరంభంలో ఆవిష్కరించిన 250సీసీ స్పోర్ట్స్ బైక్ 'హీరో హెచ్‌ఎక్స్‌250ఆర్' (Hero HX250R) విడుదల వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది ఆరంభంలో విడుదల కావల్సిన ఈ బైక్‌ను, రానున్న అక్టోబర్ నెల నాటికి వాయిదా వేసినట్లు సమాచారం.

భారత మార్కెట్‌తో పాటుగా పలు అంతర్జాతీయ మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని, హీరో మోటోకార్ప్ తమ అమెరికన్ భాగస్వామి ఎరిక్ బ్యూయెల్ రేసింగ్‌తో కలిసి ఈ హెచ్ఎక్స్250ఆర్ మోడల్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిద్దారు.

Hero MotoCorp HX250R Launch Delayed

ఈ బైక్‌లో ఉపయోగించిన 250సీసీ ఇంజన్ గరిష్టంగా 31 పిఎస్‌‌ల శక్తిని, 26 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది కేవలం 2.7 సెకండ్ల వ్యవధిలోనే 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

అండర్ సీట్ ఎగ్జాస్ట్ (సీటు క్రింద ఉండే సైలెన్సర్) ఇందులో ప్రధాన ప్రత్యేకత. ఎలక్ట్రానిక్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ ఇగ్నిషన్ సిస్టమ్, కాంబినేషన్ ఆఫ్ ఏబిఎస్ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఈ బైక్ బరువు కేవలం 139 కిలోలు మాత్రమే.

Hero HX250R

హీరో మోటోకార్ప్ తమ గ్లోబల్ ప్రోడక్ట్ (హెచ్ఎక్స్250ఆర్)కు అమెరికా, యూరప్‌లలో కూడా పేటెంట్ చేసుకుంది. ఈ బైక్ భారత్‌లో విడుదలైన తక్షణమే, అమెరికన్ మార్కెట్లలో కూడా విడుదల కానుంది. అయితే, అమెరికాలో ఇది హీరో బ్రాండ్‌తో అమ్ముడవుతుందా లేక ఈబిఆర్ బ్యాడ్జ్‌తో అమ్ముడుపోతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.

హీరో హెచ్ఎక్స్250ఆర్ అంతర్జాతీయ మార్కెట్లలో ఈ సెగ్మెంట్లోని హోండా సిబిఆర్300ఆర్, యమహా ఆర్3, కవాసకి నిన్జా 300 మోడళ్లతోను, దేశీయ మార్కెట్లో కెటిఎమ్ ఆర్‌సి200, హోండా సిబిఆర్ 250ఆర్ వంటి మోడళ్లతోనూ పోటీపడుతుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Article Published On: Friday, February 6, 2015, 14:56 [IST]
English summary
Hero MotoCorp HX250R launch has been further delayed to late 2015 in India & around the world. Hero MotoCorp HX250R coming to India soon.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+