6 నెలల్లో 12 కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్న హీరో మోటోకార్ప్

By Ravi

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్, పోటీదారుల నుంచి ఎదురవుతున్న పోటీని సమర్థవంతంగా తిప్పికొంటేందుకు భారీ ప్రణాళికలకు వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా, 2020 నాటికి రూ.60,000 కోట్ల టర్నోవర్ సాధించడం తమ ముందున్న ప్రధాన లక్ష్యమని హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పవన్ ముంజాల్ తెలిపారు.

మార్చ్ 31, 2013తో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవర్ రూ.24,000 కోట్లుగా నమోదైందని ఆయన చెప్పారు. తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు గాను, రానున్న 6 నెలల్లో 12 కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావటం, ప్రపంచం వ్యాప్తంగా 50 కొత్త మార్కెట్లోలోకి ప్రవేశించడం మరియు 20 కొత్త ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ముంజాల్ వివరించారు.

అలాగే, 2014 నాటికి మూడు ఖండాలలో 6 అసెంబ్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని పవన్ ముంజాల్ వివరించారు. భారత్‌లో 5 కోట్లవ బైక్‌ (50 మిలియన్)ను ఉత్పత్తి చేసిన సందర్భంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. తమ తర్వాతి టార్గెట్ 10 కోట్ల బైక్‌ల ఉత్పత్తి అని చెప్పారు. ఇటీవలే కెన్యా మార్కెట్లో బైక్‌లను విడుదల చేశామని, మరిన్ని దేశాల్లో కూడా తమ ద్విచక్ర వాహనాలను విడుదల చేస్తామని తెలిపారు. ఆఫ్రికా దేశాల్లో 2014 మార్చి నాటికి మరిన్ని టూవీలర్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

Hero MotoCorp To Launch 12 New Products In 6 Months

More from DriveSpark

Article Published On: Sunday, August 11, 2013, 9:09 [IST]
English summary
Country' largest two-wheeler maker Hero MotoCorp today said it plans to enter 50 new markets by 2020 with a target of 20 manufacturing facilities across the globe and an overall annual turnover of Rs 60,000 crore.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+