హీరో మోటోకార్ప్ నుంచి ప్యాషన్ ప్రో టిఆర్ మోటార్‌సైకిల్ విడుదల

By Ravi

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2014లో ఆవిష్కరించిన కొత్త 'హీరో ప్యాషన్ ప్రో టిఆర్' (Hero Passion Pro TR)ను కంపెనీ వాణిజ్య పరంగా మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో హీరో ప్యాషన్ ప్రో టిఆర్ మోటార్‌సైకిల్ ధర రూ.51,550 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

రెగ్యులర్ హీరో ప్యాషన్ ప్రో మోడల్‌ను ఆధారంగా చేసుకొని, అదనపు బాడీ కిట్‌తో ఆఫ్-రోడర్ బైక్‌లా ఈ కొత్త హీరో ప్యాషన్ ప్రో టిఆర్‌ను డిజైన్ చేశారు. ప్రత్యేకించి గ్రామీణ మార్కెట్లలోని కస్టమర్లు మరియు అత్యంత సరసమైన ధరకే ఆఫ్-రోడ్ స్టైల్ బైక్‌లను కోరుకునే యువతను లక్ష్యంగా చేసుకొని హీరో మోటోకార్ప్ ఈ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త హీరో ప్యాషన్ ప్రో టిఆర్ మోటార్‌సైకిల్‌లో పలు కాస్మోటిక్ మార్పులు ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

హీరో ప్యాషన్ ప్రో టిఆర్

తర్వాతి స్లైడ్‌లలో హీరో మోటోకార్ప్ విడుదల చేసిన ప్యాషన్ ప్రో టిఆర్ ఆఫ్-రోడ్ స్టయిల్ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

హీరో ప్యాషన్ ప్రో టిఆర్

ఈ కొత్త హీరో ప్యాషన్ ప్రో టిఆర్ ఆఫ్-రోడ్ స్టయిల్‌లో డిజైన్ చేశారు. బెటర్ రోడ్ గ్రిప్ కోసం కొత్త ఆఫ్-రోడ్ టైర్స్, హై ఫ్రంట్ ఫెండర్, ఇంజన్‌ను ప్రొటెక్ట్ చేసే స్కిడ్ ప్లేట్, ఫ్యూయెల్ ట్యాంక్‌పై క్నీ ప్యాడ్స్ (మోకాలి సంరక్షణ కోసం) మొదలైన వాటిని ఇందులో అమర్చారు.

హీరో ప్యాషన్ ప్రో టిఆర్

ఇంకా ఈ బైక్‌లో హెడ్‌లైట్ గ్రిల్ (లైట్ రక్షణ కోసం), చేతుల రక్షణ కోసం క్నకల్ ప్రొటెక్టర్ వంటి మార్పులను కూడా మనం చూడొచ్చు. ఇందులో ముందువైపు డిస్క్ బ్రేక్, వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌ను ఆఫర్ చేస్తున్నారు.

హీరో ప్యాషన్ ప్రో టిఆర్

ఇంజన్ విషయానికి వస్తే.. ఇందులో ఎలాంటి మార్పులు లేవనే చెప్పాలి. రెగ్యులర్ ప్యాషన్ ప్రోలో ఉపయోగించే 97.2సీసీ ఇంజన్‌నే ఈ కొత్త ప్యాషన్ ప్రో టిఆర్ బైక్‌లోను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7.8 బిహెచ్‌పిల శక్తిని, 8.04 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

హీరో ప్యాషన్ ప్రో టిఆర్

కొత్త ప్యాషన్ ప్రో టిఆర్‌లో పైన చెప్పుకున్న కాస్మోటిక్ మార్పులతో పాటుగా కొత్త బాడీ గ్రాఫిక్స్ కూడా ఇందులో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బ్లాక్ కలర్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ సైలెన్సర్ కవర్‌లను ఇందులో చూడొచ్చు.

హీరో ప్యాషన్ ప్రో టిఆర్

దేశీయ విపణిలో హీరో ప్యాషన్ ప్రో టిఆర్ మోటార్‌సైకిల్ ధర రూ.51,550 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 8, 2014, 18:05 [IST]
English summary
Hero MotoCorp has launched the Passion Pro TR motorcycle that is based on its popular Passion Pro 100cc motorcycle. The Passion Pro TR is priced at Rs 51,550 (ex-showroom, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+