హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ విడుదల; ధర, ఫీచర్లు

By Ravi

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, గడచిన ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన కెఫే రేసర్ స్టయిల్ 'హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్' మోటార్‌సైకిల్‌ను వాణిజ్య పరంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశీయ విపణిలో హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ మోటార్‌సైకిల్ ధర రూ.48,650 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ చూడటానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి మాదిరిగా అనిపిస్తుంది. రౌండ్ హెడ్‌ల్యాంప్, రౌండ్ టెయిల్ ల్యాంప్, రౌండ్ ఇండికేటర్ మరియు రౌండ్ సైడ్ మిర్రర్స్‌ను ఈ బైక్‌లో గమనించవచ్చు. ప్రీమియం లుక్ కోసం ఇందులో ఎక్కువ క్రోమ్‌ను ఉపయోగించారు. ఫ్రంట్ అండ్ రియర్ క్రోమ్ మడ్‌గార్డ్స్, క్రోమ్ రియర్ సస్పెన్షన్, క్రోమ్ సైలెన్సర్ కవర్‌లను ఈ ఫొటోలలో చూడొచ్చు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ విడుదల

స్ప్లెండర్ ప్రో క్లాసిక్ కెఫే రేసర్ స్టయిల్ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ విడుదల

స్ప్లెండర్ ప్రో క్లాసిక్ మోటార్‌సైకిల్‌పై ఒక్కరికి మాత్రమే చోటు ఉంటుంది. దీనిపై పిలియన్ రైడ్‌కు అవకాశం ఉండదు. అందుకే సెలబ్రేట్ సింగిల్‌హుడ్ అంటూ హీరో మోటోకార్ప్ ఈ బైక్‌ను ప్రచారం చేస్తోంది.

హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ విడుదల

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్ప్లెండర్ సిరీస్ బైక్‌లలో ఉపయోగిస్తున్న 97.2 సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజనే ఇందులోను ఉపయోగించారు.

హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ విడుదల

ఈ ఇంజన్ గరిష్టంగా 7000 ఆర్‌పిఎమ్ వద్ద 7.7 బిహెచ్‌పిల శక్తిని, 4500 ఆర్‌పిఎమ్ వద్ద 8.04 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ విడుదల

తర్వాతి స్లైడ్‌లలో హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ ఫీచర్లను తెలుసుకోండి.

హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ విడుదల

క్లాసిక్ లుక్‌నిచ్చేలా హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ కెఫే రేసర్ స్టయిల్ మోటార్‌సైకిల్‌ను డిజైన్ చేశారు. ఇందుకోసం ముందు వైపు క్రోమ్ ఫినిష్డ్ మడ్‌గార్డ్‌ను ఉపయోగించారు.

హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ విడుదల

క్లాసిక్ లుక్‌నిచ్చేందుకు దీని హైడ్‌లైట్స్‌ను మరియు టెయిల్ లైట్స్‌ను రౌండ్ షేపులో డిజైన్ చేశారు.

హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ విడుదల

స్పీడోమీటర్‌ని కూడా క్రోమ్ ఫినిష్‌తో గుండ్రటి షేపులోనే ఉంచారు. అలాగే సైడ్ వ్యూ మిర్రర్స్‌ని కూడా క్రోమ్ ఫినిష్‌తో గుండ్రటి షేపులో డిజైన్ చేశారు.

హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ విడుదల

వింటేజ్ స్టైల్ కెఫే కౌల్‌ను ఈ బైక్ వెనుక భాగంలో చూడొచ్చు. స్ప్లెండర్ ప్రో క్లాసిక్ డిజైన్‌లో ఇదే కీలకమైన అంశం.

హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ విడుదల

క్లాసిక్ లుక్ కోసం వెనుక వైపు బ్రేక్ లైట్ మరియు ఇండికేటర్ లైట్లను కూడా రౌండ్ షేపులో డిజైన్ చేశారు.

హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ విడుదల

విశాలమైన కెఫే రేసర్ స్టయిల్ సింగిల్ సీట్‌ను ఈ బైక్‌లో చూడొచ్చు.

హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ విడుదల

బాడీ గ్రాఫిక్స్‌ను కూడా సింపుల్‌గా, వింటేజ్ లుక్‌నిచ్చేలా డిజైన్ చేశారు.

హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ విడుదల

దీని హ్యాండిల్ బార్ స్పోర్టీగా, విశిష్టంగా అనిపిస్తుంది.

హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ విడుదల

హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్‌లో మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీని ఆఫర్ చేస్తున్నారు.

హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ విడుదల

హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ కేవలం రెండు రంగులలో మాత్రమే లభిస్తుంది. అవి -

1. సాలిడ్ మెరూన్

2. కార్బన్ బ్లాక్

More from DriveSpark

Article Published On: Thursday, October 9, 2014, 10:44 [IST]
English summary
Hero MotoCorp has launched the Splendor Pro Classic, which was showcased at the 2014 Delhi Auto Expo. This cafe racer-styled motorcycle is priced at INR 48,650 (ex-showroom).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+