అప్‌డేటెడ్ సూపర్ స్ప్లెండర్‌ను విడుదల చేసిన హీరో మోటోకార్ప్

By Ravi

భారతదేశపు నెంబర్ వన్ టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్, దేశీయ విపణిలో విక్రయిస్తున్న 125సీసీ స్ప్లెండర్ బ్రాండ్ మోటార్‌సైకిల్ 'హీరో సూపర్ స్ప్లెండర్' (Hero Super Splendor)లో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ కొత్త 2014 హీరో సూపర్ స్ప్లెండర్ ఇప్పుడు మరింత ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్‌తో లభిస్తుంది. ఇందులో కొత్త కలర్ ఆప్షన్లతో పాటుగా మైనర్ అప్‌డేట్స్ కూడా ఉన్నాయి.

కొత్త అప్‌డేటెడ్ హీరో సూపర్ స్ప్లెండర్ బైక్‌లో నలుపు రంగు అల్లాయ్ వీల్స్ స్టాండర్డ్‌గా లభ్యం కానున్నారు. స్ప్లెండర్ ఐ-స్మార్ట్‌లో కనిపించే సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేటర్‌ను ఈ కొత్త సూపర్ స్ప్లెండర్‌లో కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇది కొత్తగా రెడ్, బ్లాక్, గ్రే, బ్లూ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఈ చిన్నపాటి మార్పులు తప్ప కొత్త స్ప్లెండర్‌లో చెప్పుకోదగిన ఇతర మార్పులేవీ లేవు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

సరికొత్త సూపర్ స్ప్లెండర్ విడుదల

ఇంజన్ విషయానికి వస్తే.. ఇదివరకటి సూపర్ స్ప్లెండర్‌లోని 124.7సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫోర్ స్ట్రోక్ ఇంజన్‌నే ఈ కొత్త సూపర్ స్ప్లెండర్ బైక్‌లోను ఉపయోగించారు.

సరికొత్త సూపర్ స్ప్లెండర్ విడుదల

ఈ 125సీసీ ఇంజన్ గరిష్టంగా 7000 ఆర్‌పిఎమ్ వద్ద 9 బిహెచ్‌పిల శక్తిని మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 1 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ గేర్‌‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

సరికొత్త సూపర్ స్ప్లెండర్ విడుదల

డిమాండ్ లేని కారణంగా సూపర్ స్ప్లెండర్‌లో ఆప్షనల్ డిస్క్ బ్రేక్స్‌ను హీరో మోటోకార్ప్ నిలిపివేసింది. ఇప్పుడు కొత్త సూపర్ స్ప్లెండర్ 130 మి.మీ. డ్రమ్ బ్రేక్స్ (ముందు, వెనుక)తో లభిస్తుంది.

సరికొత్త సూపర్ స్ప్లెండర్ విడుదల

ఈ సరికొత్త 2014 హీరో సూపర్ స్ప్లెండర్ మోటార్‌సైకిల్ ధర రూ.51,250 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, May 9, 2014, 17:11 [IST]
English summary
Hero MotoCorp has launched the updated Super Splendor in India at Rs 51,250 (ex-showroom, Delhi). The Super Splendor now gets new body graphics, new color options (red, black, grey and blue) and few minor upgrades.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+