సిబిజెడ్ ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్‌ను విడుదల చేయనున్న హీరో మోటోకార్ప్

By Ravi

హీరో మోటోకార్ప్ గడచిన ఏప్రిల్ నెలలో విడుదల చేసిన అప్‌గ్రేడెడ్ 2014 హీరో ఎక్స్‌ట్రీమ్ బైక్‌లో మరో ప్రీమియం, స్పోర్ట్ వేరియంట్‌ను త్వరలోనే విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. హీరో మోటోకార్ప్ ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ఈ కొత్త మోడల్‌ను ప్రదర్శనకు ఉంచింది. హీరో ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ పేరుతో ఈ కొత్త వేరియంట్ విడుదల కానుంది.

హీరో మోటోకార్ప్ ఇప్పటికే విడుదల 2014 హీరో ఎక్స్‌ట్రీమ్ ప్లాట్‌ఫామ్‌పైనే ఈ కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్స్ స్పోర్ట్స్ వేరియంట్‌ను తయారు చేయనున్నాయి. ఈ రెండు బైక్‌ల బేసిక్ డిజైన్ ఒకేలా ఉంటుంది. అయితే, ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్‌కు మరింత ప్రీమియం స్పోర్టీ లుక్‌నిచ్చేందుకు గాను ఇందులో కొన్ని కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ చేయటంతో, కొన్ని ప్రీమియం ఫీచర్లను కూడా జోడించారు.

Hero MotoCorp Launching CBZ Xtreme Sports

కొత్త 2014 హీరో ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్‌లో కూడా ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్ ఫీచర్‌ను ఆఫర్ చేయనున్నారు. ఇంజన్ ఇమ్మొబిలైజర్ అనేది కార్లలో ఉండే ఓ సెక్యూరిటీ ఫీచర్. ఇమ్మొబిలైజర్ అంటే ఆ వాహనానికి సంబంధించిన సరైన తాళం చెవిని వాడితేనే ఇంజన్ స్టార్ట్ అవుతుంది. వేరే తాళంతో ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే, అలారం మ్రోగి చుట్టుప్రక్కల వారిని అప్రమత్తం చేస్తుంది. ఈ ఫీచర్ 150సీసీ సెగ్మెంట్లోనే మొట్టమొదటిది.

హీరో ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్‌లో 149.2సీసీ ఎయిర్ కూల్డ్, 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సి ఇంజన్‌నే ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద 14.4 పిఎస్‌ల శక్తిని, 6500 ఆర్‌పిఎమ్ వద్ద 12.80 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ కాన్స్టాంట్ మెష్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఇంకా ఇందులో.. ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, పెద్ద టైర్లు, సైడ్ స్టాండ్ అలెర్ట్, మొబైల్ చార్జింగ్ డాక్, స్పోర్ట్స్ డెకాల్, ఇంజన్ ప్రొటెక్షన్ గార్డ్, రీడిజైన్డ్ ఫ్యూయెల్ ట్యాంక్, టూటోన్ రియర్ వ్యూ మిర్రర్స్, ఎల్ఈడి హెడ్‌లైట్స్, బ్లూలైట్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన ఫీచర్లు లభ్యం కానున్నాయి. ఈ బైక్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, June 16, 2014, 18:05 [IST]
English summary
Hero MotoCorp has recently launched its latest avatar of the CBZ Xtreme in April, 2014. Now the Indian manufacturer will be launching a CBZ Xtreme Sports version, which by it names suggests it will pack more power than the standard model.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+