డీజిల్‌తో నడిచే బైక్‌ను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్

By Ravi

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ బుధవారం 5 సరికొత్త ఉత్పత్తులను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఇందులో కంపెనీ ఆవిష్కరించిన ఆర్‌ఎన్‌టీ (RnT) 150 సీసీ డీజిల్ బైక్ కాన్సెప్ట్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. దీంతో పాటుగా కంపెనీ తమ 'లీప్' హైబ్రిడ్ స్కూటర్‌ను, ఓ 250 సీసీ స్పోర్ట్స్ బైక్ 'హెచ్‌ఎక్స్‌ఆర్250ఆర్'ని, 110 సీసీ స్కూటర్ డాష్, 150 సీసీ బైక్ ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ బైక్‌లను విడుదల ఆవిష్కరించింది.

తమ డీజిల్ బైక్‌తో పాటుగా ఇతర మోడళ్లను కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లో విడుదల చేస్తామని హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పవన్ ముంజాల్ తెలిపారు. తాము ఆవిష్కరించిన ఈ 5 మోడళ్లలో 3 మోడళ్లు (ఆర్‌ఎన్‌టీ డీజిల్ బైక్, హైబ్రిడ్ స్కూటర్ లీప్, హెచ్‌ఎక్స్‌ఆర్250ఆర్‌లు) పూర్తిగా సరికొత్తవని మరియు డాష్ స్కూటర్, ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ బైక్‌లను మాత్రం ప్రస్తుత ప్లాట్‌ఫామ్‌లను ఆధారంగా చేసుకునే అప్‌గ్రేడ్ చేస్తున్నామని ఆయన వివరించారు.

హీరో మోటోకార్ప్ ఆవిష్కరించిన ఐదు ఉత్పత్తుల వివరాలను, ఫొటోలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

హీరో ఆర్ఎన్‌టి - 150సీసీ డీజిల్ బైక్

హీరో ఆర్ఎన్‌టి - 150సీసీ డీజిల్ బైక్

హీరో మోటోకార్ప్ ఆవిష్కరించిన ఉత్పత్తులో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ సరికొత్త 150సీసీ డీజిల్ బైక్. ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ మాత్రమే. ఇది ప్రొడక్షన్ దశకు చేరుకునేందుకు మరికొంత సమయం పడుతుంది. అత్యధిక మైలేజినిచ్చేలా, టూ-వీల్ డ్రైవ్ (ఇంజన్ నుంచి వచ్చే శక్తి రెండు చక్రాలకు బదిలీ అయ్యేలా) వంటి ఫీచర్లతో ఈ బైక్‌ను రూపొందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

హీరో ఆర్ఎన్‌టి

హీరో ఆర్ఎన్‌టి

డీజిల్ ఇంజిన్ బైక్‌పై మరింత రీసెర్చ్ చేయాల్సి ఉందని, ఈ డీజిల్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు మరింత సమయం పడుతుందని పవన్ ముంజాల్ వివరించారు. రానున్న కాలంలో ఈ బైక్‌కు యాక్సెసరీలు కూడా అందిస్తామని, ఇందులో మరిన్ని వేరియంట్‌లను ప్రవేశపెడతామని, కేవలం భారత మార్కెట్లో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ డీజిల్ బైక్‌ను విక్రయిస్తామని ఆయన చెప్పారు.

హీరో హెచ్ఎక్స్250ఆర్

హీరో హెచ్ఎక్స్250ఆర్

హీరో మోటోకార్ప్ ఆవిష్కరించిన కొత్త ఉత్పత్తుల్లో ఓ250సీసీ స్పోర్ట్స్ బైక్ కూడా ఉంది. 'హీరో హెచ్ఎక్స్250ఆర్'గా పిలిచే ఈ బైక్‌లో ఉపయోగించిన 250సీసీ ఇంజన్ గరిష్టంగా 31 బిహచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 2.7 సెకండ్ల వ్యవధిలోనే 0-60 కెఎమ్‌పిహెచ్ వేగాన్ని అందుకుంటుంది. అండర్ సీట్ ఎగ్జాస్ట్ (సీటు క్రింద ఉండే సైలెన్సర్) ఇందులో ప్రధాన ప్రత్యేకత. ఎలక్ట్రానిక్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ ఇగ్నిషన్ సిస్టమ్, కాంబినేషన్ ఆఫ్ ఏబిఎస్ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఈ బైక్ బరువు కేవలం 139 కిలోలు మాత్రమే.

హీరో డ్యాష్ - 110సీసీ స్కూటర్

హీరో డ్యాష్ - 110సీసీ స్కూటర్

హీరో డ్యాష్ స్కూటర్‌లో ప్రస్తుతం మాస్ట్ర్యో స్కూటర్‌లో ఉపయోగిస్తున్న 111సీసీ ఇంజన్‌నే ఉపయోగించారు. సరికొత్త డిజైన్ కలిగిన ఈ స్కూటర్‌లో ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్, ఈ-కోడ్ కీ, డిజిటల్ అనలాగ్ కన్సోల్, ట్యూబ్‌లెస్ టైర్స్, సర్వీస్ డ్యూ ఇండికేటర్ వంటి మరెన్నో ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు.

హీరో ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ - 150సీసీ బైక్

హీరో ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ - 150సీసీ బైక్

ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న ఎక్స్‌ట్రీమ్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని సరికొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసి ఈ కొత్త ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ బైక్‌ను తయారు చేశారు. ఇందులో ఎల్ఈడి పొజిషన్ ల్యాంప్స్‌తో కూడిన షార్ప్ హెడ్‌ల్యాంప్స్, వెడల్పాటి వెనుక టైర్ వంటి పలు ప్రత్యేకతలున్నాయి. స్ట్రీట్ ఫైటర్ స్టైల్‌లో ఈ బైక్‌ను డిజైన్ చేశారు.

హీరో లీప్ - హైబ్రిడ్ స్కూటర్

హీరో లీప్ - హైబ్రిడ్ స్కూటర్

ఇటు పెట్రోల్‌తోనూ, అటు బ్యాటరీ పవర్‌తోను నడిచే హైబ్రిడ్ స్కూటర్ లీప్‌ను మొదటగా పాశ్చాత్య దేశాల్లో మార్కెట్ చేస్తామని, ఆ తర్వాత భారత్‌లోకి తెస్తామని పవన్ ముంజాల్ తెలిపారు. ఈ స్కూటర్‌ను ఒక్కసారి చార్జింగ్ చేస్తే లేదా ట్యాంక్ ఫుల్ చేస్తే దీనిపై 340 కి.మీ. దూరం వరకు ప్రయాణించవచ్చని ఆయన వివరించారు.

విడుదల సమయం

విడుదల సమయం

వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 150 సీసీ ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ బైక్‌ను, రెండో త్రైమాసికంలో డాష్ స్కూటర్‌ను అందిస్తామని, 2013-14 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో హైబ్రిడ్ స్కూటర్‌ను, 250 సీసీ స్పోర్ట్స్ బైక్‌ను మార్కెట్లోకి తెస్తామని కంపెనీ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Thursday, January 30, 2014, 10:44 [IST]
English summary
Hero MotoCorp is in a full on assault mode as it revealed five new models ahead of the Auto Expo 2014. These are not just refreshed model we are talking about, but brand new models of a wide variety including a concept model.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+