కొత్త నాన్-ఫెస్టివ్ మంత్ సేల్స్ రికార్డ్ సృష్టించిన హీరో మోటోకార్ప్
అమ్మకాల పరంగా ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ అయిన హీరో మోటోకార్ప్ గడచిన మే నెల అమ్మకాలతో మరో సరికొత్త రికార్డును సృష్టించింది. మే 2014లో హీరో మోటోకార్ప్ మొత్తం 6,02,481 ద్విచక్ర వాహనాలను విక్రయించి, పండుగ సీజన్ కాని నెలలో అత్యధిక నెలవారీ అమ్మకాల (నాన్-ఫెస్టివ్ మంత్ సేల్స్) రికార్డును నెలకొల్పింది.
అంతకు ముందు ఏప్రిల్ 2014 నెలలో హీరో మోటోకార్ప్ 5,71,054 ద్విచక్ర వాహనాలను విక్రయించి రికార్డు సృష్టించగా, మే 2014 నెల అమ్మకాలతో ఈ రికార్డు బద్దలయ్యింది. బ్రాండ్ ఇమేజ్, విశ్వసనీయత, సరసమైన ధరలు, మెరుగైన సేవలు, విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్ వంటి అనేక అంశాలు హీరో మోటోకార్ప్ విజయానికి సోపానాలుగా మారుతున్నాయి.

మే 2013లో హీరో మోటోకార్ప్ 5,57,890 ద్విచక్ర వాహనాలను విక్రయించగా మే 2014లో 6,02,481 ద్విచక్ర వాహనాలను విక్రయించి 8 శాతం వృద్ధిని కనబరించింది. అంతేకాదు మే 2014లో కంపెనీ మొత్తం 6 లక్షలకు పైగా వాహనాలను విక్రయించి, రెండు సార్లు నెలవారీ ఆరు లక్షల అమ్మకాల రికార్డును స్థాపించింది. గడచిన సంవత్సరం అక్టోబర్ నెలలో హీరో మోటోకార్ప్ 6.25 లక్షల వాహనాలను విక్రయించింది. ఇదే కంపెనీ అత్యధిక నెలవారీ అమ్మకాలు రికార్డు కూడాను.


Click it and Unblock the Notifications








