15 కొత్త మోడళ్లను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్
భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ రానున్న ఆరు నెలల్లో 15 కొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేయనుంది. గుర్గావ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పవన్ ముంజాల్ ఈ 15 కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించారు. ఇవన్నీ వచ్చే ఏడాది మార్చి నాటికల్లా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.
ఈ 15 కొత్త ఉత్పత్తులలో కొన్ని ప్రస్తుత మోడళ్లకు అప్‌గ్రేడెడ్ మోడళ్లు కాగా మరికొన్ని సరికొత్త మోడళ్లుగా ఉండనున్నాయి. వీటిలో ఒక్కో ఉత్పత్తికి ఒక్కో ప్రత్యేకత ఉండనుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఈ ఉత్పత్తులను అప్‌గ్రేడ్ చేశారు. కంపెనీ ఆవిష్కరించిన కొత్త ద్విచక్ర వాహనాల్లో కరిజ్మా ఆర్, కరిజ్మా జెడ్‌ఎమ్ఆర్, స్ప్లెండర్ ఐ-స్మార్ట్‌లతో పాటు ప్లెజర్ స్కూటర్ మోడల్‌లో అప్‌గ్రేడెడ్ వెర్షన్లు ఉన్నాయి.
ఈ 15 కొత్త ఉత్పత్తుల్లో అధిక భాగం ప్రస్తుత పండుగల సీజన్‌లోనే మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. మరి హీరో మోటోకార్ప్ నుంచి లభ్యం కానున్న ఆ 15 కొత్త ఉత్పత్తుల వివరాలేంటో క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

స్ప్లెండర్ ఐస్మార్ట్.. ఐ3ఎస్ టెక్నాలజీతో
కార్లకు మాత్రమే పరిమితమైన ఇంజన్ స్టార్ట్/స్టాప్ ఫీచర్‌ను హీరో మోటోకార్ప్ తమ ఉత్పుత్తులలో ఆఫర్ చేయనుంది. ఈ టెక్నాలజీని ఐ3ఎస్ అని పిలువనున్నారు. సిగ్నల్స్ వద్ద ఎక్కువ సేపు వాహనం నిలిపి ఉన్నప్పుడు లేదా ఇంజన్ ఐడిల్‌గా ఉన్నప్పుడు ఇంజన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవటం, క్లచ్/యాక్సిలరేట్ నొక్కినప్పుడు మళ్లీ ఇంజన్ ఆన్ అవ్వటం ఈ ఫీచర్ ప్రత్యేకత. దీని వలన అధిక మైలేజీని పొందటమే కాకుండా, తక్కువ కార్బన్ ఉద్గారాలు వెలువరించేందుకు కూడా ఇది సహకరిస్తుందని కంపెనీ పేర్కొంది.

నెక్స్ట్ జనరేషన్ ప్లెజర్ ఆటోమేటిక్ స్కూటర్
హీరో మోటోకార్ప్ అందిస్తున్న ప్లెజర్ స్కూటర్‌ను కూడా కంపెనీ అప్‌గ్రేడ్ చేసింది. కొత్త హీరో ప్లెజర్ స్కూటర్ 'ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్'తో లభ్యం కానుంది. ఇప్పటికే హోండా తమ స్కూటర్లలో ఈ టెక్నాలజీని (కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్) అందిస్తోంది. ఇందులో ఫ్రంట్ లేదా రియర్ బ్రేక్ అప్లయ్ చేసినప్పుడు ముందు, వెనుక బ్రేక్‌లు ఒకేసారి అప్లయ్ అయ్యి, స్టాపింగ్ దూరాన్ని తగ్గిస్తాయి.

నెక్స్ట్ జనరేషన్ ప్లెజర్ ఆటోమేటిక్ స్కూటర్
ప్లెజర్ స్కూటర్‌లో ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్‌కు అదనంగా, మొబైల్ చార్జర్ సాకెట్, లాకబిల్ గ్లవ్ బాక్స్, లగేజ్ బాక్సులో బూట్ లైట్, కాంబినేషన్ ఇగ్నిషన్ లాక్ విత్ సీట్ ఓపెనింగ్ మరియు సైడ్ స్టాండ్ ఇండికేటర్ వార్నింగ్ వంటి ఇతర స్మార్ట్ ఫీచర్లను కూడా జోడించనున్నారు.

నెక్స్ట్ జనరేషన్ సిబిజెడ్ ఎక్స్‌ట్రీమ్
హీరో నుంచి రానున్న ఈ అప్‌గ్రేడెడ్ 150సీసీ ప్రీమియం మోటార్‌సైకిల్‌లో ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్ ఫీచర్‌ను జోడించనున్నారు. అలాగే, దీని డిజైన్‌లో కూడా మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇంజన్ ఇమ్మొబిలైజర్ అనేది కార్లలో ఉండే ఓ సెక్యూరిటీ ఫీచర్. ఇమ్మొబిలైజర్ అంటే ఆ వాహనానికి సంబంధించిన సరైన తాళం చెవిని వాడితేనే ఇంజన్ స్టార్ట్ అవుతుంది. వేరే తాళంతో ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే, అలారం మ్రోగి ప్రజలను అప్రమత్తం చేస్తుంది.

నెక్స్ట్ జనరేషన్ కరిజ్మా ఆర్
హీరో మోటోకార్ప్ అందిస్తున్న కరిజ్మా ఆర్ (బాడీ ప్యానెల్స్ లేని నేక్డ్ వెర్షన్)లో కూడా కంపెనీ ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. అంతర్జాతీయ సాంకేతిక భాగస్వాముల సహకారంతో కంపెనీ ఈ బైక్ డిజైన్, ఇంజన్, ఫీచర్లను అభివృద్ధి చేసింది. ఇందులో కొత్త 223సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు.

నెక్స్ట్ జనరేషన్ కరిజ్మా జెడ్ఎమ్ఆర్
అదే విధంగా హీరో మోటోకార్ప్ అందిస్తున్న కరిజ్మా జెడ్ఎమ్ఆర్ (బాడీ ప్యానెల్స్ కలిగిన ఫుల్లీ ఫెయిర్డ్ వెర్షన్)లో కూడా కంపెనీ ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. దీనిని డిజైన్, ఇంజన్, ఫీచర్లను కూడా అంతర్జాతీయ సాంకేతిక భాగస్వాముల సహకారంతో కంపెనీ అభివృద్ధి చేసింది. ఇందులో కూడా కొత్త 223సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు.

హెచ్ఎఫ్ డాన్, హెచ్ఎఫ్ డీలక్స్
మిగిలిన మోడళ్లలో నెక్స్ట్ జనరేషన్ హెచ్ఎఫ్ డాన్, హెచ్ఎఫ్ డీలక్స్‌లు కూడా ఉన్నాయి. ఇవి సైడ్ స్టాండ్ ఇండికేటర్ వార్నింగ్, క్లియర్ వింకర్స్ వంటి ఫీచర్లతో లభ్యం కానున్నాయి.

హెచ్ఎఫ్ డీలక్స్ ఈకో
హెచ్ఎఫ్ డీలక్స్ ఈకో బైక్‌లో లెగ్ గార్డ్స్‌పై స్టయిలిష్ ఫోయిల్స్, ఎక్కువ స్పీడ్ వద్ద ఎయిర్ రెసిస్టెన్స్‌ను తగ్గించేలా డిజైన్ చేసిన స్టయిలిష్ ఏరో మిర్రర్స్, లో రోలింగ్ ఫ్రిక్షన్‌తో కూడిన టైర్లు వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

కొత్త స్ప్లెండర్ ప్రో, 125సీసీ సూపర్ స్ప్లెండర్
కంపెనీ అందిస్తున్న 100సీసీ స్ప్లెండర్ ప్రో, అలాగే 125సీసీ సూపర్ స్ప్లెండర్ మోడళ్లలో కూడా అప్‌గ్రేడెడ్ వెర్షన్లను కంపెనీ విడుదల చేయనుంది. ఇవి కొత్త గ్రాఫిక్స్, కొత్త డయల్ డిజైన్ మరియు సైడ్ స్టాండ్ ఇండికేటర్ వార్నింగ్ వంటి ఫీచర్లతో లభ్యం కానున్నాయి.

నెక్స్ట్ జనరేషన్ ప్యాషన్ ప్రో
అదేవిధంగా, కంపెనీ అందిస్తున్న 100సీసీ ప్యాషన్ ప్రో మోటార్‌సైకిల్‌లో కూడా కంపెనీ నెక్స్ట్ జనరేషన్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇది సైడ్ స్టాండ్ ఇండికేటర్, సర్వీస్ రిమైండర్, స్టయలిష్ ఆల్-బ్లాక్ శారీ గార్డ్, కొత్త బాడీ గ్రాఫిక్స్, కొత్త డయల్ డిజైన్, కొత్త బాడీ కలర్ వంటి ఇతర ఫీచర్లతో లభ్యం కానున్నాయి.

నెక్స్ట్ జనరేషన్ గ్లామర్, గ్లామర్ ఎఫ్ఐ
ఇక చివరిగా, హీరో మోటోకార్ప్ అందిస్తున్న 125సీసీ బైక్ గ్లామర్, గ్లామర్ ఎఫ్ఐ మోడళ్లలో కూడా అప్‌గ్రేడెడ్ వెర్షన్లు రానున్నాయి. ఇవి కొత్త రేస్ గ్రాఫిక్స్, డయల్ డిజైన్‌తో అందుబాటులో ఉండనున్నాయి.


Click it and Unblock the Notifications








