భారత్‌లో కెల్లా అత్యంత చవకైన కెఫే రేసర్ 'స్ప్లెండర్ ప్రో క్లాసిక్'

By Ravi

భారత ద్విచక్ర వాహన మార్కెట్లో కెఫే రేసర్ స్టయిల్ మోటార్‌సైకిళ్లకు ప్రాణం పోసింది రాయల్ ఎన్‌ఫీల్డ్. కాంటినెంటల్ జిటి కెఫే రేసర్ స్టయిల్ మోటార్‌సైకిల్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఓ కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. అయితే, ఈ బైక్ సామాన్యులకు అందుబాటులో లేదు. దీని ధర సుమారు రెండు లక్షల రూపాయలకు పైమాటే.

కానీ, దీనికి ఆల్టర్నేటివ్ కోరుకునే వారికి అత్యంత సరసమైన ధరకే కెఫే రేసర్ స్టయిల్‌ను అందిస్తోంది హీరో మోటోకార్ప్. గడచిన ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో హీరో మోటోకార్ప్ ప్రదర్శించిన కెఫే రేసర్ స్టయిల్ 'హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్' మోటార్‌సైకిల్‌ను కంపెనీ సైలెంట్‌గా మార్కెట్లో విడుదల చేసినట్లు సమాచారం.

hero motocorp splendor pro classic is here

దేశీయ విపణిలో దీని ధరను రూ.53,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు. హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ చూడటానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి మాదిరిగా అనిపిస్తుంది. రౌండ్ హెడ్‌ల్యాంప్, రౌండ్ టెయిల్ ల్యాంప్, రౌండ్ ఇండికేటర్ మరియు రౌండ్ సైడ్ మిర్రర్స్‌ను ఈ బైక్‌లో గమనించవచ్చు. ప్రీమియం లుక్ కోసం ఇందులో ఎక్కువ క్రోమ్‌ను ఉపయోగించారు.

ఫ్రంట్ అండ్ రియర్ క్రోమ్ మడ్‌గార్డ్స్, క్రోమ్ రియర్ సస్పెన్షన్, క్రోమ్ సైలెన్సర్ కవర్‌లను ఈ బైక్‌లో గమనించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్ప్లెండర్ సిరీస్ బైక్‌లలో ఉపయోగిస్తున్న 97.2 సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజనే ఇందులోను ఉపయోగించారు.

hero motocorp splendor pro classic cafe racer

ఈ ఇంజన్ గరిష్టంగా 7000 ఆర్‌పిఎమ్ వద్ద 7.7 బిహెచ్‌పిల శక్తిని, 4500 ఆర్‌పిఎమ్ వద్ద 8.04 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది రెండు రంగులలో (సాలిడ్ మెరూన్, కార్బన్ బ్లాక్) మాత్రమే లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, September 20, 2014, 13:43 [IST]
English summary
The Indian two wheeler giant Hero MotoCorp has opted to call its cafe racer motorcycle as Splendor Pro Classic. Hero MotoCorp has produced one of the most affordable cafe racer bike in India. The motorcycle has been priced at INR 53,900 ex-showroom.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+