బ్రెజిల్ మార్కెట్‌పై హీరో కన్నేసిన హీరో మోటోకార్ప్

By Ravi

భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ విదేశీ విస్తరణలో భాగంగా బ్రెజిల్ మార్కెట్‌పై కన్నేసింది. బ్రెజిల్‌‌లో ద్విచక్ర వాహన మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతుండటంతో హీరో మోటోకార్ప్ ఆ మార్కెట్లో అడుగుపెట్టాలని భావిస్తోంది.

రానున్న 2016 నాటికి బ్రెజిల్ మార్కెట్లోకి ప్రవేశించి, వీలైనం తక్కువ కాలంలో తన స్థానాన్ని పటిష్ఠం చేసుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో భాగంగానే, కొలంబియాలో 7 కోట్ల డాలర్లతో కొత్త ఉత్పత్తి కేంద్రాన్ని హీరో మోటోకార్ప్ ఏర్పాటు చేయనుంది.

2016లో జరిగే ఒలింపిక్స్ నాటికి బ్రెజిల్ మార్కెట్లోకి ప్రవేశించాలనే ఆలోచనతో ఉన్నామని, ఈ మార్కెట్‌కు తగిన విధంగా ఇంజన్లను కూడా అభివృద్ధి చేస్తున్నామని అని హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పవన్ ముంజాల్ వెల్లడించారు.

Hero MotoCorp To Sell Bikes In Brazil By 2016

బ్రెజిల్‌లో ఇథనాల్ కలిసిన పెట్రోల్‌ను వాడుతారని, ఈ నేపథ్యంలో ఇంజన్లను ఆ ఇంధనానికి తగినట్టుగా అభివృద్ధి చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. లాటిన్ అమెరికాలో బ్రెజిల్ అతిపెద్ద మార్కెట్‌గా రూపాంతరం చెందిందని, టెక్నికల్‌గా ఇక్కడి మార్కెట్ ఇతర మార్కెట్లకన్నా (ఇథనాల్ ఇంధనం వాడతారు కాబట్టి) భిన్నమైందని ముంజాల్ తెలిపారు.

ప్రస్తుతం భారత్‌లో వినియోగిస్తున్న ఇంజన్లు (పూర్తి పెట్రోల్‌తో నడిచేవి) ఇక్కడి మార్కెట్‌కు తగిన విధంగా ఉండవు కాబట్టి, ఆ మార్కెట్ కోసం ఇంజన్లను ప్రత్యేకంగా అభివృద్ధిచేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రారంభంలో భాగంగా, బ్రెజిల్ మార్కెట్ కోసం ద్విచక్ర వాహనాలను భారత్ నుంచి దిగుమతి చేసుకోవటం కానీ లేదా వాటిని పూర్తిగా కొలంబియా ప్లాంట్‌లో ఉత్పత్తి చేయడం గానీ చేస్తామని ఆయన చెప్పారు.

More from DriveSpark

Article Published On: Saturday, June 14, 2014, 11:18 [IST]
English summary
The Indian manufacturer Hero MotoCorp is planning to enter the Brazilian market in 2016. India's top most selling motorcycle manufacturer will enter Brazil strategically during the Olympics, which will be held in 2016.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+