హైటెక్ ఫీచర్లతో కూడిన ఉత్పత్తులను అందించనున్న హీరో మోటోకార్ప్

By Ravi

ప్రపంచపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ సమీప భవిష్యత్తులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉత్పత్తులను అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు సాంకేతిక భాగస్వాములతో ఒప్పందాలను కుదుర్చుకునేందుకు తమ కంపెనీ సన్నాహాలు చేస్తుందని హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పవన్ ముంజాల్ తెలిపారు.

హీరో మోటోకార్ప్ తమ జపాన్ భాగస్వామి హోండా నుంచి విడిపోయిన తర్వాత, తమ అంతర్జాతీయ మార్కెట్ పరిమాణాన్ని విస్తరించుకోడం, సాంకేతిక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే, అమెరికాకు చెందిన ఎరిక్ బ్యూయెల్ రేసింగ్ (ఈబీఆర్) కంపెనీలో 49.2 శాతం వాటాను కొనుగోలు చేసింది.

అలాగే, ఆస్ట్రేలియాకు చెందిన ఇంజన్‌లు అభివృద్ధి చేసే ఏవీఎల్ కంపెనీతోను, ఇటలీకి చెందిన టూవీలర్ డిజైన్ సంస్థ ఇంజన్స్ ఇంజినీరింగ్‌తో కూడా ఒప్పందాలు కుదుర్చుకుంది. 2020 నాటికి 50 దేశాల్లో తమ నెట్‌వర్క్‌ను విస్తరించడం, అంతర్జాతీయంగా 20 ప్లాంట్లను ఏర్పాటు చేయడం, రూ.60 వేల కోట్ల టర్నోవర్ సాధించడం తమ ముందు సవాళ్లని కంపెనీ పేర్కొంది. మరి కంపెనీ అందించనున్న హైటెక్ టెక్నాలజీ ఫీచర్లేంటో తెలుసుకునేందుకు క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

స్ప్లెండర్ ఐస్మార్ట్.. స్టార్ట్/స్టాప్ టెక్నాలజీతో

స్ప్లెండర్ ఐస్మార్ట్.. స్టార్ట్/స్టాప్ టెక్నాలజీతో

కార్లకు మాత్రమే పరిమితమైన ఇంజన్ స్టార్ట్/స్టాప్ ఫీచర్‌ను హీరో మోటోకార్ప్ తమ ఉత్పుత్తులలో ఆఫర్ చేయనుంది. ఈ టెక్నాలజీని ఐ3ఎస్ అని పిలువనున్నారు. సిగ్నల్స్ వద్ద ఎక్కువ సేపు వాహనం నిలిపి ఉన్నప్పుడు లేదా ఇంజన్ ఐడిల్‌గా ఉన్నప్పుడు ఇంజన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవటం, క్లచ్/యాక్సిలరేట్ నొక్కినప్పుడు మళ్లీ ఇంజన్ ఆన్ అవ్వటం ఈ ఫీచర్ ప్రత్యేకత.

స్ప్లెండర్ ఐస్మార్ట్.. స్టార్ట్/స్టాప్ టెక్నాలజీతో

స్ప్లెండర్ ఐస్మార్ట్.. స్టార్ట్/స్టాప్ టెక్నాలజీతో

ఈ ఫీచర్‍‌ను తొలిసారిగా స్ప్లెండర్ ఐస్మార్ట్ బైక్‌లో ఉపయోగించానున్నారు. ఈ ఫీచర్ వలన అధిక మైలేజీని పొందటమే కాకుండా, ఇది తక్కువ కార్బన్ ఉద్గారాలు వెలువరించేందుకు కూడా సహకరిస్తుందని కంపెనీ పేర్కొంది. కొత్త బడ్జెట్ బైక్‌లతో వేడిక్కిన మార్కెట్ వాతావరణంలో ఈ కొత్త పీచర్‌తో కూడిన స్ప్లెండర్‌కు మంచి గిరాకీ ఏర్పడే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది.

కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్

కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్

హోండా ఇప్పటికే తమ స్కూటర్లలో ఈ టెక్నాలజీని అందిస్తోంది. ఈ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌లో బ్రేక్ అప్లయ్ చేసినప్పుడు ముందు, వెనుక బ్రేక్‌లు ఒకేసారి అప్లయ్ అయ్యి, స్టాపింగ్ దూరాన్ని తగ్గిస్తాయి. హోండా యాక్టివా, డియో స్కూటర్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలోనే ఇది హీరో ద్విచక్ర వాహనాల్లో కూడా అందుబాటులోకి రానుంది.

కొత్త ప్లెజర్

కొత్త ప్లెజర్

హీరో మోటోకార్ప్ నుంచి రానున్న నెక్స్ట్ జెన్ ప్లెజర్ ఆటోమేటిక్ స్కూటర్‌లో ఈ ఇంటిగ్రేటెడ్/కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను పరిచయం చేయనున్నారు. ఈ ఫీచర్ వలన స్టాపింగ్ దూరం తగ్గటమే కాకుండా, టూవీలర్ హ్యాండ్లింగ్ కూడా సమర్థవంతంగా ఉంటుంది.

ఇంజన్ ఇమ్మొబిలైజర్

ఇంజన్ ఇమ్మొబిలైజర్

ఇది కూడా కార్లలో ఉండే ఫీచర్. ఇమ్మొబిలైజర్ అంటే ఆ వాహనానికి సంబంధించిన సరైన తాళం చెవిని వాడితేనే ఇంజన్ స్టార్ట్ అవుతుంది. హీరో మోటోకార్ప్ నుంచి రానున్న సరికొత్త 150 సీసీ బైక్ హీరో ఎక్స్‌ట్రీమ్‌లో ఈ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఈ ఫీచర్ వలన వాహనం దొంగతనాలకు గురికాదు.

నెక్స్ట్ జెన్ కరిజ్మా జెడ్ఎమ్ఆర్

నెక్స్ట్ జెన్ కరిజ్మా జెడ్ఎమ్ఆర్

ఈ ఫీచర్లన్నింటితో పాటుగా హీరో మోటోకార్ప్ ఓ నెక్స్ట్ జెన్ కరిజ్మా జెడ్ఎమ్ఆర్ స్పోర్ట్స్ బైక్‌ను విడుదల చేయనుంది. ఇటీవలే మకావ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ ముంజాల్ ఈ బైక్‌ను ఆవిష్కరించారు.

స్వంత ఆర్ అండ్ డి

స్వంత ఆర్ అండ్ డి

ఈ టెక్నాలజీలన్నింటినీ తమ స్వంత ఆర్ అండ్ డి సెంటర్‍‌లో అభివృద్ధి చేస్తామని పవన్ ముంజాల్ చెప్పారు. ఈ కొత్త ఫీచర్లు కేవలం ప్రారంభం మాత్రమేనని, కొత్త ప్లాట్‌ఫామ్‌లపై సరికొత్త మోడళ్లను రూపొందిస్తున్నామని, వీటన్నింటిని వచ్చే ఏడాది జరగనున్న ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శిస్తామని ఆయన తెలిపారు.

More from DriveSpark

Article Published On: Friday, October 4, 2013, 12:10 [IST]
English summary
In the coming months we could witness some exciting developments coming from the Hero MotoCorp stable as the Indian two wheeler major plans to upgrade its two wheeler lineup extensively. Vague details about some of these plans came to light at Hero MotoCorp's recently held annual sales conference at Macau.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+