పవర్‌ఫుల్ హీరో ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

By Ravi

దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ అందిస్తున్న 'ఎక్స్‌ట్రీమ్' మోటార్‌సైకిల్‌లో కంపెనీ ఓ స్పోర్ట్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. హీరో ఎక్స్‌ట్రీమ్స్ స్పోర్ట్స్ పేరుతో లభ్యం కానున్న ఈ కొత్త వేరియంట్‌ను ఇదివరకటి 2014 ఎక్స్‌‌ట్రీమ్ మోడల్‌ను ఆధారంగా చేసుకొని డిజైన్ చేశారు. అయితే, ఇది రెగ్యులర్ ఎక్స్‌ట్రీమ్ కన్నా మరింత స్పోర్టీగా కనిపిస్తుంది. అంతేకాకుండా.. ఇందులో ఇంజన్ పవర్ కూడా అధికంగా ఉంటుంది.

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం.. కొత్త హీరో మోటోకార్ప్ ఎక్స్‌ట్రీమ్‌లో ఉపయోగించిన 149.2సీసీ ఇంజన్ గరిష్టంగా 15.2 హెచ్‌పిల శక్తిని, 13.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది (రెగ్యులర్ వెర్షన్ 12.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ని రిలీజ్ చేస్తుంది). ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, ఫ్రంట్ డిస్క్ అండ్ రియర్ డ్రమ్ బ్రేక్ ఆప్షన్లతో లభిస్తుంది.

Hero Xtreme Sports

విపణిలో వీటి ధరలు ఇలా ఉన్నాయి:
  • ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్ (ఫ్రంట్ డిస్క్ అండ్ రియర్ డ్రమ్) - రూ.73,200
  • ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్ (ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్) - రూ.76,500

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై)

హీరో ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్‌లో కూడా రెగ్యులర్ ఎక్స్‌ట్రీమ్ మాదిరిగానే ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్ ఫీచర్‌ను ఆఫర్ చేయనున్నారు. ఇంజన్ ఇమ్మొబిలైజర్ అనేది కార్లలో ఉండే ఓ సెక్యూరిటీ ఫీచర్. ఇమ్మొబిలైజర్ అంటే ఆ వాహనానికి సంబంధించిన సరైన తాళం చెవిని వాడితేనే ఇంజన్ స్టార్ట్ అవుతుంది. వేరే తాళంతో ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే, అలారం మ్రోగి చుట్టుప్రక్కల వారిని అప్రమత్తం చేస్తుంది. ఈ ఫీచర్ 150సీసీ సెగ్మెంట్లోనే మొట్టమొదటిది.

Hero MotoCorp Xtreme Sports Gets A Performance Bump

ఇంకా ఇందులో.. ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, పెద్ద టైర్లు, సైడ్ స్టాండ్ అలెర్ట్, మొబైల్ చార్జింగ్ డాక్, స్పోర్ట్స్ డెకాల్, ఇంజన్ ప్రొటెక్షన్ గార్డ్, రీడిజైన్డ్ ఫ్యూయెల్ ట్యాంక్, టూటోన్ రియర్ వ్యూ మిర్రర్స్, ఎల్ఈడి హెడ్‌లైట్స్, బ్లూలైట్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన ఫీచర్లు లభ్యం కానున్నాయి. ఇది ఐదు కలర్ ఆప్షన్లలో (ఫైరీ రెడ్, పైరో ఆరెంజ్, పాంథర్ బ్లాక్, మెర్క్యూరిక్ సిల్వర్, బ్లాక్ అండ్ రెడ్) లభ్యం కానుంది.

More from DriveSpark

Article Published On: Saturday, February 14, 2015, 16:52 [IST]
English summary
Hero MotoCorp's Xtreme Sports features an air-cooled, single cylinder 149.2cc engine. Previously this engine developed 12.6 Nm of peak torque output. Now the official website confirms that now the engine delivers 13.5 Nm of torque and 15.2 horsepower.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+