హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ బుకింగ్స్ ఓపెన్; జనవరి 29న విడుదల!

By Ravi

దేశీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) సరికొత్త టెక్నాలజీతో తయారు చేసిన 'హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్' (Hero Splendor iSmart) ఈనెల 29న విడుదల కానున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, హీరో మోటోకార్ప్ డీలర్లు కొత్త స్ప్లెండర్ ఐస్మార్ట్ కోసం బుకింగ్‌లను స్వీకరించడాన్ని ఇప్పటికే ప్రారంభించినట్లు మార్కెట్ వర్గాల సమాచారం.

అంతేకాదు, ఈ బైక్‌కు సంబంధించి మరిన్ని వివరాలు కూడా లీక్ అయ్యాయి. స్ప్లెండర్ ఐస్మార్ట్ మోటార్‌సైకిల్ స్ప్లెండర్ ఎన్ఎక్స్‌జి మాదిరి బాడీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది నారుగు సరికొత్త రంగుల్లో (స్పోర్ట్ రెడ్, లీఫ్ గ్రీన్, ఎక్సలెంట్ బ్లూ, హెవీ గ్రే) లభ్యం కానుంది. ఇవే కాకుండా, ఈ బైక్‌లోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌‌లో అనలాగ్ స్పీడో, ఓడో అండ్ ఫ్యూయెల్ మీటర్, సైడ్ స్టాండ్, హై బీమ్, న్యూట్రల్ అండ్ సైడ్ ఇండికేటర్ వార్నింగ్ లైట్స్ ఉంటాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోగదగినది స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ.

Hero Splendor iSmart

గడచిన అక్టోబర్ నెలలో హీరో మోటోకార్ప్ ఆవిష్కరించిన 15 కొత్త అప్‌గ్రేడెడ్ ఉత్పత్తుల్లో హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ మొదటిది. ఇక దీని ఇంజన్ విషయానిక్ వస్తే, ఇందులో 97.2సీసీ ఎయిర్-కూల్డ్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 7.7 బిహెచ్‌పిల శక్తిని, 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 0.82 కేజిఎమ్‌ల టార్క్‌‌ను ఉత్పత్తి చేస్తుంది. డ్రమ్ బ్రేక్స్, ట్యూబ్‌లెస్ టైర్స్, బ్లాక్ అల్లాయ్ వీల్స్ వంటి ఇతర ఫీచర్లు ఈ బైక్ సొంతం. దీని ఎక్స్-షోరూమ్ (పూనే) ధర రూ.44,750గా ఉంది.

హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ ఇంజన్ స్టార్ట్/స్టాప్ ఫీచర్‌ టెక్నాలజీతో లభ్యం కానుంది. ఇప్పటి వరకు కార్లకు మాత్రమే పరిమితమైన ఈ ఆటోమేటిక్ ఇంజన్ స్టార్ట్/స్టాప్ ఫీచర్‌ను ఇండియన్ మోటార్‌సైకిళ్లలో కెల్లా తొలిసారిగా హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్‌లో ఆఫర్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీని ఐ3ఎస్ అని పిలువనున్నారు (మహీంద్రా స్కార్పియోలో కూడా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు, దీనిని మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ అని పిలుస్తారు). దీని వలన అధిక మైలేజీని పొందటమే కాకుండా, తక్కువ కార్బన్ ఉద్గారాలు వెలువరించేందుకు కూడా ఇది సహకరిస్తుందని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Saturday, January 18, 2014, 8:43 [IST]
English summary
According to sources, Hero MotoCorp dealers have started taking bookings for the new Splendor iSmart. The new Hero Splendor iSmart will be launched on January 29, 2014 which was unveiled in October last year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+