హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

By Ravi

దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ మరో సరికొత్త మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ అందిస్తున్న స్ప్లెండర్ సిరీస్‍‌లో 'హీరో స్లెండర్ ఐస్మార్ట్' (Hero Splendor iSmart) పేరిట ఓ అధునాతన బైక్‌ను ప్రవేశపెట్టింది.

హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్‌‌ను కంపెనీ గడచిన సంవత్సరంలో ప్రకటించి, ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ప్రస్తుతం లభిస్తున్న అన్ని స్ప్లెండర్‌ల కన్నా ఇది ఎన్నో రెట్లు అధుతనాతనమైనది మరియు మెరుగైనది.

హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన 'ఐ3ఎస్ టెక్నాలజీ' (i3S Technology)తో లభిస్తుంది. ఈ టెక్నాలజీ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, ఇదొక 'ఐడిల్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్'.

ఇంజన్ ఖాలీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఇంజన్ ఆఫ్ కావటం, క్లచ్ నొక్కగానే తిరిగి స్టార్ట్ కావటం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీ కార్లలో మాత్రమే ఉండేది. ఇండియాలో ఓ మోటార్‌సైకిల్‌లో ఈ టెక్నాలజీని పరిచయం చేయటం ఇదే మొట్టమొదటిసారి.

హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ విడుదల

హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్‌ ధర, ఇంజన్, ఫీచర్లు, ఐ3ఎస్ టెక్నాలజీ మరియు ఇతర వివరాలను తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

ఇంజన్

ఇంజన్

హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్‌లో 100సీసీ, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7.8 పిఎస్‌ల శక్తిని, 8.04 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఐ3ఎస్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?

ఐ3ఎస్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?

కార్లలో మాదిరిగానే ఇంజన్ ఖాలీగా ఉన్నప్పుడు గుర్తించి ఆటోమేటిక్‌గా ఇంజన్ ఆఫ్ అవ్వటం, క్లచ్ నొక్కగానే తిరిగి ఇంజన్ ఆన్ అవ్వటం జరుగుతుంది. ఉదాహరణకు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎక్కువ సేపు వేచి ఉండాల్సి వచ్చినప్పుడు ఇంజన్ ఐడిల్‌గా ఉండటాన్ని గుర్తించి ఆటోమేటిక్ ఇంజన్ ఆఫ్ అవుతుంది, తిరిగి క్లచ్ నొక్కగానే ఆన్ అవుతుంది. అలాకాకుండా, స్టార్ట్/స్టాప్ బటన్‌తో మ్యాన్యువల్‌గా కూడా దీనిని ఆపరేట్ చేసుకోవచ్చు.

హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ విడుదల

భవిష్యత్తులో తాము తయారు చేయబోయే ఇత మోడళ్లలో కూడా ఐ3ఎస్ టెక్నాలజీని తీసుకువస్తామని, ఈ టెక్నాలజీ వలన మైలేజ్ పెరుగుతుందని హీరో మోటోకార్ప్ పేర్కొంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీకి పేటెంట్ పెండింగ్‌లో ఉంది.

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్‌ క్రింది కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది.

* స్పోర్ట్స్ రెడ్

* లీఫ్ గ్రీన్

* ఎక్సలెంట్ బ్లూ

* హెవీ గ్రే

ధరలు

ధరలు

దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

* రూ. 47,250/- (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

* రూ. 49,967/- (ఎక్స్-షోరూమ్, ముంబై)

* రూ. 48,192/- (ఎక్స్-షోరూమ్, చెన్నై)

* రూ. 48,549/- (ఎక్స్-షోరూమ్, కోల్‌కత్తా)

* రూ. 48,014/- (ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)

హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ విడుదల

స్ప్లెండర్ ఐస్మార్ట్ బైక్ విడుదల సందర్భంగా హీరో మోటోకార్ప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) అనీల్ దువా మాట్లాడుతూ.. ద్విచక్ర వాహన మార్కెట్లో విప్లవాత్మక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే దిశలో భాగంగా, తమ స్ప్లెండర్ ఐస్మార్ట్‌ను విడుదల చేస్తున్నామని, స్టైల్, పెర్ఫార్మెన్స్ మరియు సేఫ్టీల కలయికే ఈ బైక్ అని తెలిపారు. స్ప్లెండర్ ఐస్మార్ట్‌ను మైలేజ్ పెంచే ఐ3ఎస్ టెక్నాలజీతో తయారు చేశామని, భవిష్యత్తులో తాము తయారు చేయబోయే ఇత మోడళ్లలో కూడా ఈ టెక్నాలజీని పరిచయం చేస్తామని ఆయన చెప్పారు.

హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ విడుదల

స్ప్లెండర్ ఐస్మార్ట్ బైక్‌లోని స్టయిలిష్ బాడీ గ్రాఫిక్స్, పవర్ స్టార్ట్ స్విచ్, స్టయిలిష్ అల్లాయ్ వీల్స్ మరియు స్టయిలిష్ మీటర్ కన్సోల్‌ను ఈ ఫొటోలో చూడొచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, March 13, 2014, 18:47 [IST]
English summary
Hero MotoCorp's new Splendor iSmart has been launched. Hero Splendor iSmart comes with i3S technology, which stands for ‘Idle Stop and Start System'. That's exactly what it is. India's first motorcycle with start/stop feature; a feature more commonly seen in cars, enables the Splendor to be even more economical than before.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+