హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ విడుదల; ధర రూ.53,900
దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ గడచిన ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన కెఫే రేసర్ స్టయిల్ 'హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్' మోటార్‌సైకిల్‌ను కంపెనీ సైలెంట్‌గా మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో దీని ధరను రూ.53,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు.
హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ చూడటానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి మాదిరిగా అనిపిస్తుంది. రౌండ్ హెడ్‌ల్యాంప్, రౌండ్ టెయిల్ ల్యాంప్, రౌండ్ ఇండికేటర్ మరియు రౌండ్ సైడ్ మిర్రర్స్‌ను ఈ బైక్‌లో గమనించవచ్చు. ప్రీమియం లుక్ కోసం ఇందులో ఎక్కువ క్రోమ్‌ను ఉపయోగించారు. ఫ్రంట్ అండ్ రియర్ క్రోమ్ మడ్‌గార్డ్స్, క్రోమ్ రియర్ సస్పెన్షన్, క్రోమ్ సైలెన్సర్ కవర్‌లను ఈ ఫొటోలలో చూడొచ్చు.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

స్ప్లెండర్ ప్రో క్లాసిక్ కెఫే రేసర్ స్టయిల్ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్ప్లెండర్ సిరీస్ బైక్‌లలో ఉపయోగిస్తున్న 97.2 సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజనే ఇందులోను ఉపయోగించారు.

ఈ ఇంజన్ గరిష్టంగా 7000 ఆర్‌పిఎమ్ వద్ద 7.7 బిహెచ్‌పిల శక్తిని, 4500 ఆర్‌పిఎమ్ వద్ద 8.04 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

స్ప్లెండర్ ప్రో క్లాసిక్ కెఫే రేసర్ స్టయిల్ మోటార్‌సైకిల్

Click it and Unblock the Notifications