హీరో జిర్ 150సీసీ స్కూటర్ - ఫొటోలు, స్పెసిఫికేషన్లు, పీచర్లు

By Ravi

హీరో మోటోకార్ప్ ద్విచక్ర వాహన మార్కెట్లో తన సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమవుతోంది. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ అనేక ఆసక్తికరమైన ఉత్పత్తులను ఆవిష్కరించింది. అందులో 'హీరో జిర్' 150సీసీ స్కూటర్ కూడా ఒకటి.

యూరోపియన్ మాక్సీ స్కూటర్ స్టయిలింగ్‌ను కలిగి ఉండే ఈ హీరో జిర్ 150సీసీ స్కూటర్‌ను హీరో మోటోకార్ప్ బ్రాండ్ అంబాసిడర్ రణబీర్ కపూర్ ఆవిష్కరించారు. కైనటిక్ బ్లేజ్ 165సీసీ స్కూటర్ మాదిరిగానే ఇదికూడా హెవీ ఇంజన్‌తో, హెవీ బాడీని కలిగి ఉంటుంది.

మరి ఈ హీరో జిర్ స్కూటర్‌ను మన భారతీయులు అంగీకరిస్తారా..? ఇంతకీ ఈ స్కూటర్ విశిష్టతలేమిటి..? తెలుసుకుందాం రండి..!

హీరో జిర్ 150సీసీ స్కూటర్

హీరో జిర్ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది.ఈ రెండు వేరియంట్లలో డిజైన్ పరంగా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉంటాయి, కానీ ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు.

హీరో జిర్ 150సీసీ స్కూటర్

హీరో జిర్ స్కూటర్ బరువు 139 కేజీలు. ఇది 2085 మి.మీ. పొడవును, 745 మి.మీ. వెడల్పును మరియు 1385 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది.

హీరో జిర్ 150సీసీ స్కూటర్

హీరో జిర్‌లో 157సీసీ లిక్విడ్ కూల్డ్, 4-స్ట్రోక్, 2-వాల్వ్ ఎలక్ట్రానిక్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద 14.08 హెచ్‌పిల శక్తిని, 7000 ఆర్‌పిఎమ్ వద్ద 12.7 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 110 కిలోమీటర్లు.

హీరో జిర్ 150సీసీ స్కూటర్

ఫోర్స్డ్ డైనమిక్ కూలింగ్ ఎయిర్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఐహెచ్‌బిఎస్)లు ఇందులోని ప్రత్యేకతలు. ఇందులో ముందు వైపు 225 మి.మీ. ఫ్లో టైప్ డిస్క్ బ్రేక్, వెనుక వైపు 220 మి.మీ. ఫ్లోటైప్ డిస్క్ బ్రేక్స్‌ను ఉపయోగించారు.

హీరో జిర్ 150సీసీ స్కూటర్

ప్రీమియం స్కూటర్ అయిన హీరో జిర్‌లో డ్యూయెల్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఇంటిగ్రేటెడ్ పిలియన్ హ్యాండిల్, డిజిటల్ కన్సోల్, ఫోన్ చార్జింగ్ సాకెట్ వంటి ఫీచర్లున్నాయి.

హీరో జిర్ 150సీసీ స్కూటర్

చివరిగా.. హీరో జిర్‌లోని ఎలక్ట్రానిక్ ఫ్యూయెల్ ఇంజన్ సిస్టమ్‌ను స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేసుకుంటే, ఇంజన్ అండ్ రైడింగ్ ఇన్‌ఫర్మేషన్‌ను అప్లికేషన్ సాయంతో ఫోన్‌పై చూడొచ్చు.

హీరో జిర్ 150సీసీ స్కూటర్

హీరో జిర్ స్కూటర్ ప్రస్తుతానికి కాన్సెప్ట్ దశలో ఉంది. ఇది వినియోగదారులకు అందుబాటులోకి రావటానికి 2016 వరకు సమయం పట్టొచ్చని తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 11, 2014, 10:25 [IST]
English summary
Showcased along with the Hero Dash 125cc scooter at the Auto Expo 2014, where brand ambassador Ranbir Kapoor took the veils off the new scooters, was the ZIR.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+