హోండా యాక్టివా 125 అంచనా ధర రూ.60,000

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా తమ యాక్టివా స్కూటర్ సిరీస్‌లో ఓ కొత్త 125సీసీ వెర్షన్‌ను గడచిన ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ఈ కొత్త హోండా యాక్టివా 125 మరికొద్ది రోజుల్లోనే మార్కెట్‌ను తాకనుంది. దేశీయ విపణిలో ఈ 125సీసీ యాక్టివా స్కూటర్ ధర సుమారు రూ.60,000 (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా.

పవర్‌ఫుల్ ఇంజన్‌తో కూడిన పెర్ఫామెన్స్ వెర్షన్ యాక్టివాను కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ 125సీసీ వెర్షన్ యాక్టివాను తయారు చేసింది. హోండా ఇప్పటికే యాక్టివా సిరీస్‌లో తక్కువ ధర కలిగిన 'యాక్టివా ఐ' స్కూటర్‌ను రెగ్యులర్ 110సీసీ యాక్టివాకు దిగువన ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. కాగా.. ఈ కొత్త యాక్టివా 125ను రెగ్యులర్ 110సీసీ యాక్టివాకు ఎగువన ప్రవేశపెట్టనున్నారు.


హోండా తమ యాక్టివా 125ను కింగ్ ఆఫ్ స్కూటర్స్ అని పిలుస్తోంది. ఎందుకంటే, ఇందులో పవర్‌ఫుల్ 124సీసీ, ఫోర్-స్ట్రోక్, ఫోర్స్ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ 125సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6500 ఆర్‌పిఎమ్ వద్ద 8.6 హెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10.12 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త యాక్టివా 125 స్కూటర్ ఫ్రంట్ డిజైన్‌లో మార్పు మినహా, ఇది రెగ్యులర్ 110సీసీ యాక్టివా మాదిరిగానే అనిపిస్తుంది. బ్లాక్డ్అవుట్ హెడ్‍‌లైట్ క్రౌన్, ఇండికేటర్ ల్యాంప్స్ మధ్యలో అమర్చిన క్రోమ్‌ ఇన్‌సెర్ట్‌లు ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన మార్పులు. అప్ ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, కాంబి బ్రేక్ సిస్టమ్ ఇందులో స్టాండర్డ్‌గా లభిస్తుంది. ఆప్షనల్‌గా డిస్క్ బ్రేక్స్‌ను ఆఫర్ చేయనున్నారు.

Honda Activa 125 Price

రెగ్యులర్ 110సీసీ యాక్టివాకు ఈ కొత్త 125సీసీ యాక్టివాకు మధ్య వ్యత్యాసాన్ని చూపే విధంగా కంపెనీ ఈ మోడల్ హెడ్‌లైట్‌ను కస్టమైజ్ చేసింది. డిజిటల్ అనలాగ్ ఇన్‍‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో మరో ప్రత్యేకత. కొత్త హోండా యాక్టివా 125 ఈ సెగ్మెంట్లోని సుజుకి యాక్సెస్, స్విష్, వెస్పా వంటి 125సీసీ స్కూటర్లకు పోటీగా నిలువనుంది. హోండాకు 125సీసీ స్కూటర్ సెగ్మెంట్లో కూడా ఇదే మొదటి ఉత్పత్తి.

More from DriveSpark

Article Published On: Tuesday, March 11, 2014, 13:31 [IST]
English summary
Honda Motorcycle and Scooter India is readying its new Activa 125 for domestic market launch. The new powerful Honda Activa 125 expected price is around Rs 60,000 (ex-showroom).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+