ఆటో ఎక్స్‌పో 2014: హోండా యాక్టివా 125 ఆవిష్కరణ
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా అందిస్తున్న యాక్టివా స్కూటర్ సిరీస్‌లో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. పవర్‌ఫుల్ ఇంజన్‌తో పెర్ఫామెన్స్ వెర్షన్ యాక్టివాను కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకొని, కంపెనీ ఓ 125సీసీ వెర్షన్ యాక్టివాను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ కొత్త యాక్టివా 125ను ఆవిష్కరించింది.
యాక్టివా సిరీస్‌లో ఇప్పటికే తక్కువ ధర కలిగిన 'యాక్టివా ఐ' స్కూటర్‌ను ప్రవేశపెట్టిన హోండా ఈ కొత్త యాక్టివా 125 మోడల్‌ను, ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న రెగ్యులర్ 110సీసీ యాక్టివాకు ఎగువన ప్రవేశపెట్టనుంది. ఇది ఈ సెగ్మెంట్లో సుజుకి యాక్సెస్, స్విష్, వెస్పా వంటి 125సీసీ స్కూటర్లను పోటీగా నిలువనుంది. హోండాకు 125సీసీ స్కూటర్ సెగ్మెంట్లో కూడా ఇదే మొదటి ఉత్పత్తి కావటం విశేషం.
హోండా యాక్టివా 125 మోడల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

హోండా తమ యాక్టివా 125ను కింగ్ ఆఫ్ స్కూటర్స్ అని పిలుస్తోంది. ఎందుకంటే, ఇందులో పవర్‌ఫుల్ 124సీసీ, ఫోర్-స్ట్రోక్, ఫోర్స్ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ 125సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6500 ఆర్‌పిఎమ్ వద్ద 8.6 హెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10.12 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త యాక్టివా 125 స్కూటర్ ఫ్రంట్ డిజైన్‌లో మార్పు మినహా, ఇది రెగ్యులర్ 110సీసీ యాక్టివా మాదిరిగానే అనిపిస్తుంది. బ్లాక్డ్అవుట్ హెడ్‍లైట్ క్రౌన్, ఇండికేటర్ ల్యాంప్స్ మధ్యలో అమర్చిన క్రోమ్ ఇన్‌సెర్ట్‌లు ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన మార్పులు.

అప్ ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, కాంబి బ్రేక్ సిస్టమ్ ఇందులో స్టాండర్డ్‌గా లభిస్తుంది. ఆప్షనల్‌గా డిస్క్ బ్రేక్స్‌ను ఆఫర్ చేయనున్నారు.

రెగ్యులర్ 110సీసీ యాక్టివాకు ఈ కొత్త 125సీసీ యాక్టివాకు మధ్య వ్యత్యాసాన్ని చూపే విధంగా కంపెనీ ఈ మోడల్ హెడ్‌లైట్‌ను కస్టమైజ్ చేసింది. డిజిటల్ అనలాగ్ ఇన్‍స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో మరో ప్రత్యేకత.

హోండా యాక్టివా 125సీసీ స్కూటర్‍కు సంబంధించిన ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ఇది మార్కెట్లో విడుదల కానుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








