ఇంటి వద్దకే సర్వీస్ అందించే 'హోండా యాక్టివా డాక్టర్'
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న స్కూటర్ 'హోండా యాక్టివా' త్వరలోనే ఓ కొత్త పాత్ర పాషించనుంది. ద్విచక్ర వహన మార్కెట్లో శరవేగంగా వృద్ధి చెందుతున్న జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా, రూరల్ మార్కెట్లలో కూడా తమ ప్రస్థానాన్ని విస్తరించుకునేందుకు గాను సరికొత్త ప్రణాళికలతో ముందుకొస్తోంది.
ఇందులో భాగంగానే, హోండా యాక్టివా డాక్టర్ అనే సేవలను పరిచయం చేసేందుకు హోండా సన్నాహాలు చేస్తుంది. ఈ ప్రణాళికలో భాగంగా, హోండా తమ వెహికల్ రిపేర్, సర్వీస్ ప్రోగ్రామ్‌లను మరింత మెరుగుపరచనుంది. హోండా యాక్టివా డాక్టర్ ప్రోగ్రామ్‌లో భాగంగా, ప్రజల ఇంటి వద్దకే సర్వీసింగ్ సేవలను తీసకువచ్చే వెసలుబాటును కంపెనీ కల్పించనుంది.
హోండా యాక్టివా డాక్టర్ స్కీమ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

హోండా ఇప్పటికే మొబైల్ సర్వీస్ వ్యాన్‌లను కొన్ని ప్రధాన నగరాల్లో నిర్వహిస్తోంది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సేవలు అందుబాటులో లేవు. అందుకే, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు సర్వీసింగ్ సేవలను మరింత సులువుగా యాక్సెస్ చేసుకునేలా హోండా యాక్టివా డాక్టర్ పేరిట ఈ కొత్త ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది.

హోండా యాక్టివా డాక్టర్ ప్రోగ్రామ్‌లో సర్వీస్ బృందాలు నేరుగా కస్టమర్ ఇంటికి వెళ్లి సర్వీసింగ్ సేవలను ఆఫర్ చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన హోండా యాక్టివా స్కూటర్లను ఉపయోగించనున్నారు.

అన్ని రకాల హోండా ద్విచక్ర వాహనాల్లో తలెత్తే చిన్నపాటి సమస్యలను మొదలకు మేజర్ సమస్యలను సైతం సరిచేసేందుకు కావల్సిన పరికరాలను ఈ హోండా యాక్టివా డాక్టర్ స్కూటర్లలో అమర్చుతారు.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి సర్వీస్ సెంటర్‌లోను ఓ హోండా యాక్టివా డాక్టర్ స్కూటర్ ఉంటుంది. దీనిని నిపుణులైన మెకానిక్‌లు నడుపుతుంటారు.

గ్రామీణ మార్కెట్లలో తమ బ్రాండ్‌ను మరింత విస్తరింరజేసుకునేందుకు, అలాగే ద్విచక్ర వాహన మార్కెట్లో తమ మార్కెట్ వాటాను మరింత పెంచుకునేందుకు హోండా ఈ కొత్త ప్రణాళిక చేపట్టినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








