హోండా యాక్టివా-ఐ స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా జూన్ 12న ఓ సరికొత్త స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇది వరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. ఇప్పుడు హోండా అందరినీ ఆశ్చర్యపరుస్తూ. స్కూటర్ సెగ్మెంట్లో ధరల యుద్ధానికి తెరలేపుతూ అత్యంత చవక ధరకే ఓ సరికొత్త స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

హోండా యాక్టివా-ఐ (Honda Activa-i) పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ స్కూటర్ దర కేవలం రూ.44,200 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మాత్రమే. హోండా అందిస్తున్న యాక్టివా సిరీస్‌లోనే కంపెనీ ఈ కొత్త స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న యక్టివా స్కూటర్‌‌లో ఉపయోగించిన 109సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్‌నే ఈ కొత్త యాక్టివా-ఐ స్కూటర్‌లోను ఉపయోగించారు.

ఈ ఇంజన్ గరిష్టంగా 8 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా హోండా ఈకో టెక్నాలజీతో అభివృద్ధి చేయబడి లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. యాక్టివా, యాక్టివా-ఐ స్కూటర్‌కు డిజైన్ పరంగా అనేక మార్పులు ఉన్నాయి. ఈ కొత్త స్కూటర్ వైట్, పర్పల్, రెడ్ మరియు బీజ్ అనే నాలుగు రంగులలో లభిస్తుంది. ఈనెల చివరి నుంచి యాక్టివా-ఐ అమ్మకాలు ప్రారంభమవుతాయి.

ఈ స్కూటర్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

యాక్టివా-ఐ స్కూటర్

యాక్టివా-ఐ స్కూటర్

స్కూటర్ సెగ్మెంట్లో ధరల యుద్ధానికి తెరలేపుతూ హోండా అత్యంత చవక ధరకే 'యాక్టివా-ఐ' అనే పేరుతో ఓ సరికొత్త స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

ధర

ధర

భారత మార్కెట్లో ఈ స్కూటర్ దర కేవలం రూ.44,200 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మాత్రమే.

ఇంజన్

ఇంజన్

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న యక్టివా స్కూటర్‌‌లో ఉపయోగించిన 109సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్‌నే ఈ కొత్త యాక్టివా-ఐ స్కూటర్‌లోను ఉపయోగించారు.

పెర్ఫామెన్స్, మైలేజ్

పెర్ఫామెన్స్, మైలేజ్

ఈ ఇంజన్ గరిష్టంగా 8 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా హోండా ఈకో టెక్నాలజీతో అభివృద్ధి చేయబడి లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

ఈ కొత్త స్కూటర్ వైట్, పర్పల్, రెడ్ మరియు బీజ్ అనే నాలుగు రంగులలో లభిస్తుంది.

కాంబీ బ్రేక్ సిస్టమ్‌

కాంబీ బ్రేక్ సిస్టమ్‌

ఇందులో కూడా కాంబీ బ్రేక్ సిస్టమ్‌ను ఉపయోగించారు.

మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీ

మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీ

యాక్టివా-ఐ స్కూటర్ మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీతో లభిస్తుంది.

లైట్ వెయిట్

లైట్ వెయిట్

హోండా యాక్టివా-ఐ స్కూటర్ మొత్తం బరువును 103 కేజీలకు తగ్గించారు.

అత్యంత చవకైన స్కూటర్

అత్యంత చవకైన స్కూటర్

హోండా యాక్టివా-ఐ ఈ సెగ్మెంట్లో కెల్లా అత్యంత చవకైన స్కూటర్.

కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త టెయిల్ లైట్స్

కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త టెయిల్ లైట్స్

వెడల్పాటి సీట్, హగ్గర్ ఫెండర్

వెడల్పాటి సీట్, హగ్గర్ ఫెండర్

Most Read Articles

English summary
Honda has launched a new variant of the Activa gearless scooter called Activa i. Priced at Rs 44,000 (ex-showroom, Delhi), Activa i is about Rs 3,000 less expensive than the regular Activa, making it the new base Honda scooter model available in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X