హీరో స్ప్లెండర్‌ను ఓవర్‌టేక్ చేసిన హోండా యాక్టివా

భారతదేశపు ద్విచక్ర వాహన మార్కెట్లో స్కూటర్ సెగ్మెంట్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ఇటీవలి కాలంలో ఈ సెగ్మెంట్లోకి అనేక కొత్త మోడళ్లు ప్రవేశించాయి, మరికొన్ని ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం గేర్లతో నడిచే మోటార్‌సైకిళ్ల కన్నా గేర్లు లేని స్కూటర్లకే డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. అర్బనైజేషన్ పెరగటం, మహిళా కొనుగోలుదారులు ఎక్కువ కావటంతోనే స్కూటర్ సెగ్మెంట్ ఇంత వేగంగా వృద్ధి చెందుతోంది.

స్కూటర్ సెగ్మెంట్లోకి కొత్తగా ఎన్ని మోడళ్లు వచ్చినప్పటికీ, హోండా యాక్టివా మాత్రం ఎవర్‌గ్రీన్ మోడల్‌గానే నిలిచిపోయింది. హోండా యాక్టివాకు డిమాండ్ ఎంతలా ఉందంటే, గడచిన రెండు దశాబ్ధాలుగా మార్కెట్ లీడర్‌గా ఉన్న హీరో స్ప్లెండర్ మోటార్‌సైకిల్ కన్నా ఈ స్కూటర్‌నే కొనుగోలుదారులు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. గడచిన సెప్టెంబర్ నెలలో స్ప్లెండర్ అమ్మకాలను యాక్టివా ఓవర్‌టేక్ చేసి అగ్రస్థానంలో నిలిచింది.

Honda Activa Scooter Overtakes Hero Splendor Bike

ప్రత్యేకించి ఛండీఘడ్, ఇంఫాల్, గోవా, కేరళ వంటి స్థానిక మార్కెట్లలో బైక్‌ల కన్నా స్కూటర్లకే ఎక్కువగా డిమాండ్ ఉంటోంది. అలాగే ప్రధాన మార్కెట్లయిన ఢిల్లీ, ముంబై, చెన్నై, పూనే వంటి నగరాల్లో కూడా స్కూటర్లకు, బైక్‌లకు మధ్య వ్యత్యాసం చాలా వరకు తగ్గింది. గడచిన నాలుగేళ్లలో స్కూటర్ అమ్మకాలు 26 శాతం వృద్ధి చెందగా, ఇదే సమయంలో మోటార్‌సైకిల్ అమ్మకాలు 15 శాతం మాత్రమే వృద్ధి చెందినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

స్కూటర్ విభాగంలో ఎక్కువగా లబ్ధి పొందుతోంది హోండా అనే చెప్పాలి. ఈ సెగ్మెంట్లో యాక్టివా, యాక్టివా ఐ, డియో, ఏవియేటర్ మోడళ్లను విక్రయిస్తోంది. మరోవైపు రానున్న రోజుల్లో కొత్త స్కూటర్లను విడుదల చేసేందుకు కూడా హోండా సన్నాహాలు చేస్తుంది. హోండా నుంచి ఓ పవర్‌ఫుల్ 125సీసీ స్కూటర్ కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ, మొత్తమ్మీద చూసుకుంటే స్కూటర్లు కూడా మోటార్‌సైకిల్‌తో పోటీపడి మరి జోరును కనబరుస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, November 5, 2013, 9:08 [IST]
English summary
Scooters are not only the fastest growing segment of the Indian automotive market, but are increasingly taking on their most-erstwhile rival - bikes, as the gearless vehicles gain favour here. Honda Activa displaced the two-decade-old market leader Hero's Splendor motorcycle from the top slot in September.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+