తగ్గనున్న హోండా యాక్టివా వెయటింగ్ పీరియడ్!
హోండా యాక్టివా స్కూటర్ ప్రియులకు గుడ్ న్యూస్. మీ డ్రీమ్ స్కూటర్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారు ఇకపై నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. అతిత్వరలోనే హోండా యాక్టివా వెయిటింగ్ పీరియడ్ తగ్గనుంది. ప్రస్తుతం డీలరును బట్టి హోండా యాక్టివా వెయిటింగ్ పీరియడ్ నెల రోజుల నుంచి రెండు నెలల వరకు ఉంటోంది.
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులోని నర్సాపూర్ వద్ద ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహన తయారీ ప్లాంటులో హోండా యాక్టివా ఉత్పత్తిని విజయవంతంగా ప్రారంభించింది. దీంతో యాక్టివా స్కూటర్ ఉత్పత్తి సామర్థ్యం పెరగనుంది. ఫలితంగా హోండా యాక్టివా వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా తగ్గనుంది.

హోండా నర్సాపూర్ ప్లాంటులో తొలుతగా డ్రీమ్ యుగ 110సీసీ మోటార్‌సైకిల్‌ను ఉత్పత్తి చేశారు. ఆ తర్వాత యాక్టివా ఆటోమేటిక్ స్కూటర్ ఉత్పత్తిని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్లాంటులో ఏటా 12 లక్షల ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. కాగా, ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని మరో 50 శాతం మేర పెంచనున్నారు.
అంటే, 2013 చివరి నాటికి ఈ ప్లాంటులో ఏటా 18 లక్షల ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేయనున్నారు. ఇదిలా ఉండగా, హోండా అందిస్తున్న యాక్టివాలో కంపెనీ లైట్ వెయిట్ వెర్షన్ 'యాక్టివా ఐ'ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసినదే.
కాగా తాజా సమాచారం ప్రకారం, హోండా యాక్టివాలో కంపెనీ మరొక పవర్‌ఫుల్ వెర్షన్ (125సీసీ ఇంజన్‌తో)ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా త్వరలోనే మార్కెట్లోకి రానుంది. మొత్తమ్మీద చూసుకుంటే, నర్సాపూర్ ప్లాంట్ పుణ్యమా అని యాక్టివా వెయిటింగ్ పీరియడ్ దిగిరానుంది.


Click it and Unblock the Notifications








