హోండా షైన్: భారత్‌లో అత్యధికంగా సేల్ అవుతున్న 125సీసీ బైక్

By Ravi

భారత ద్విచక్ర వాహన మార్కెట్లో బెస్ట్ 125సీసీ బైక్ ఏదంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు 'హోండా షైన్'. జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా అందిస్తున్న సిబి షైన్ 125సీసీ బైక్ భారత మార్కెట్లో అత్యంత పాపులర్ మోడల్‌గా ఎదిగింది. అంతేకాదు, భారతదేశంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న పాపులర్ 125సీసీ బైక్ కూడా హోండా షైన్ కావటం విశేషం.

ఇప్పటి వరకు భారత్‌లో 30 లక్షల హోండా సిబి షైన్ బైక్‌లు ఉత్పత్తి అయ్యాయి. తాజాగా.. రాజస్థాన్‌లోని తపుకరా ప్లాంట్‌లో తయారు చేసిన 30 లక్షవ సిబి షైన్ బైక్‌ను కంపెనీ విడుదల చేసింది. సిబి షైన్ తొలిసారిగా 2006లో భారత్‌లో విడుదలైంది. విడుదలైన కేవలం 54 నెలల వ్యవధిలో ఇది 10 లక్షల మార్కును తాకింది. ఆ తర్వాత 25 నెలలకు 20 లక్షల మార్కును ఇప్పుడు కేవలం 16 నెలలకే 30 లక్షల మార్కును చేరుకుంది.

హోండా సిబి షైన్ 125సీసీ బైక్ ఇంత పాపులర్ కావటానికి కారణాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం రండి..!

ఆప్టిమ్యాక్స్ ఇంజన్

ఆప్టిమ్యాక్స్ ఇంజన్

ఇందులో ప్రధాన ప్రత్యేకత జపనీస్ టెక్నాలజీతో రూపొందిన 125సీసీ ఆప్టిమ్యాక్స్ (OPTIMAX) ఇంజన్. ఆప్టిమ్యాక్స్ అంటే గరిష్ట అవుట్‌పుట్ కోసం కనిష్ట ఇన్‌పుట్ (Optimum fuel input to Maximize pickup & mileage output)ని అందజేయటం అని అర్థం. సింపుల్‌గా చెప్పాలంటే, తక్కువ ఇంధనాన్ని గ్రహించి ఎక్కువ మైలేజ్, పవర్, పికప్‌లను అందించడం అన్నమాట.

బెస్ట్ మైలేజ్

బెస్ట్ మైలేజ్

కంపెనీ ప్రతిపాదించిన దాని ప్రకారం, హోండా సిబి షైన్ లీటర్ పెట్రోల్‌కు గరిష్టంగా 65 కి.మీ. మైలేజీని ఇస్తుంది. అయితే వాస్తవానికి ఇది డ్రైవింగ్ చేసే విధానం, గేర్లు మార్చే విధానం, నడిపే రోడ్లపై ఆధారపడి ఉంటుంది. రియల్ వరల్డ్‌లో సిటీ మరియు హైవేపై కలిపి ఇది సగటున 55-60 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.

పవర్, పెర్ఫార్మెన్స్

పవర్, పెర్ఫార్మెన్స్

హోండా సిబి షైన్‌లో ఉపయోగించిన 124.7సీసీ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 10.12 బిహెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10.54 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

హోండా షైన్ కేవలం 2.3 సెకండ్లలోనే 0.60 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. ఆప్టిమ్యాక్స్ ఇంజన్‌లో హోండా పొందుపరచిన అనేక కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీల ద్వారా ఇది సాధ్యమవుతుంది.

కంఫర్టబల్ రైడ్

కంఫర్టబల్ రైడ్

లాంగ్ రైడ్‌లకు వెళ్లాలనుకునే వారికి సైతం హోండా సిబి షైన్ చక్కగా సరిపోతుంది. సాధారణంగా కొన్ని బైక్‌లను ఎక్కువ దూరం నడిపితే నడుం నొప్పి రావటం జరుగుతుంది. అయితే హాండా షైన్‌లో ఈ బాధ ఉండదు. దీనిలో ఉన్న ఎర్గో-టెక్ డిజైన్, డైమండ్ ఫ్రేమ్, 3-స్టెప్ సస్పెన్షన్ సిస్టమ్ కారణంగా ఎటువంటి రోడ్లపై అయినా సౌకర్యవంతంగా ఎంత దూరమైనా సరే హాయిగా ప్రయాణించవచ్చు.

ట్యూబ్‌లెస్ టైర్స్, డిస్క్ బ్రేక్

ట్యూబ్‌లెస్ టైర్స్, డిస్క్ బ్రేక్

హోండా సిబి షైన్‌లో చెప్పుకోవాల్సిన మరో ప్రత్యేకమైన ఫీచర్ ట్యూబ్‌లెస్ టైర్స్. సాధారణంగా గ్రామీణ ప్రాంత రోడ్లపై టైర్లు ఎక్కువగా పంక్చర్ అవుతుండటాన్ని గమనిస్తుంటాం. అయితే, హోండా షైన్‌లో ఈ ఇబ్బంది ఉండదు. ఇది ట్యూబ్‌లెస్ టైర్ ఆప్షన్‌తో లభిస్తుంది కాబట్టి పంక్చర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. హోండా షైన్‌లో ముందు వైపు ఉండే డిస్క్ బ్రేక్ మంచి బ్రేకింగ్ కాన్ఫిడెన్స్‌ను కలిగిస్తుంది.

మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీ

మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీ

ఇందులో అమర్చిన పవర్‌ఫుల్ మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీ ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా సరే ఇంజన్ టక్కున ఆన్ అయ్యేందుకు సహకరిస్తుంది.

చివరి మాట

చివరి మాట

ఇక లుక్ విషయానికి వస్తే.. స్టయిలిష్ గ్రాఫిక్స్, ట్యాంక్‌పై 3డి హోండా లోగో, హ్యాండిల్ బార్, సరికొత్త సైడ్ మిర్రర్స్ డిజైన్, బాడీ కలర్‌లో ఉండే గ్రాబ్ రెయిల్, సైలెన్సర్ కవర్‌లు హోండా షైన్‌కు ఓ ప్రీమియం బైక్ లుక్‌నిస్తాయి. ఇక దీని ధర కూడా ఈ సెగ్మెంట్లో కెల్లా సరసమైనదే. పవర్, మైలేజ్, పికప్, బడ్జెట్‌ను పరిగణిలోకి తీసుకునే వారికి హోండా షైన్ ఒక చక్కటి ఆప్షన్‌గా నిలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, April 24, 2014, 12:21 [IST]
English summary
Honda CB Shine has been revealed as India's best selling 125cc motorcycle. earlier this month, Honda Motorcycle & Scooter India rolled out the 30th lakh CB Shine from the Tapukara manufacturing plant in Rajasthan. The CB Shine leads by a massive 61 percent margin over its nearest competitor.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+