'హోండా సిబి ట్రిగ్గర్' 150సీసీ బైక్ విడుదల: ధర, ఫీచర్లు
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ 'హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్' (హెచ్ఎమ్ఎస్ఐ) ఇటీవలే దేశీయ విపణిలో ఆవిష్కరించిన శక్తివంతమైన 150సీసీ మోటార్‌సైకిల్ 'సిబి ట్రిగ్గర్' (CB Trigger)ను మార్కెట్లో వాణిజ్య పరంగా విడుదల చేసింది. భారత మార్కెట్లో హోండా సిబి ట్రిగ్గర్ ధర రూ.67,384 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించినట్లు హోండా పేర్కొంది.
తాము అందిస్తున్న హోండా సిబి ట్రిగ్గర్ బైక్‌లో ఈ సెగ్మెంట్లో కెల్లా మొట్టమొదటి సారిగా కాంబి బ్రేక్ సిస్టమ్ (సిబిఎస్)ను ఇందులో ఆఫర్ చేస్తున్నామని హెచ్ఎమ్ఎస్ఐ తెలిపింది. ఈ బైక్‌లో శక్తివంతమైన 150సీసీ ఇంజన్‌ను ఉపయోగించినప్పటికీ ఇది మైలేజ్‌లో ఎక్కడా రాజీ పడదని, తమ కొత్త బైక్ లీటరు పెట్రోల్‌కు 60 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ వెల్లడించింది.
హోండా సిబి ట్రిగ్గర్‌లో అమర్చిన 149సీసీ ఫోర్-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 13.81 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 6500 ఆర్‌పిఎమ్ వద్ద 12.5 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఈ సెగ్మెంట్లో బజాజ్ పల్సర్ 150, టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 మోడళ్లతో పోటీ పడనుంది.
హోండా విడుదల చేసిన తమ సరికొత్త సిబి ట్రిగ్గర్ 150 మోటార్‌సైకిల్‌లో వినూత్నమైన 3డి హోండా యాంబ్లమ్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, డిజిటల్ అడ్వాన్స్‌డ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, ఎల్‌ఈడి టెయిల్ లైట్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఇది మూడు ఆకర్షణీయ రంగుల్లో లభ్యం కానుంది.

హోండా సిబి ట్రిగ్గర్

హోండా సిబి ట్రిగ్గర్

హోండా సిబి ట్రిగ్గర్

హోండా సిబి ట్రిగ్గర్

హోండా సిబి ట్రిగ్గర్

హోండా సిబి ట్రిగ్గర్

హోండా సిబి ట్రిగ్గర్



Click it and Unblock the Notifications








