హైదరాబాద్‌లో 'హోండా సిబి ట్రిగ్గర్' బైక్ ధరలు

By Ravi

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్' (హెచ్ఎమ్ఎస్ఐ) ఇటీవల భారత మార్కెట్లో ఆవిష్కరించిన సరికొత్త 150సీసీ మోటార్‌సైకిల్‌ 'సిబి ట్రిగ్గర్' (CB Trigger)ను ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మార్కెట్లోను లభ్యం కానుంది. ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో హోండా సిబి ట్రిగ్గర్ ప్రారంభ ధర రూ.70,391 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది.

హోండా సిబి ట్రిగ్గర్‌లో అమర్చిన 149సీసీ ఫోర్-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 13.81 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 6500 ఆర్‌పిఎమ్ వద్ద 12.5 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇందులో శక్తివంతమైన 150సీసీ ఇంజన్‌ను ఉపయోగించినప్పటికీ మైలేజ్ విషయంలో ఎక్కడా రాజీ పడదని, ఇది లీటరు పెట్రోల్‌కు 60 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని హెచ్ఎమ్ఎస్ఐ వెల్లడించింది.

Honda CB Trigger

అధునాతన ఫీచర్లు, సరికొత్త టెక్నాలజీ, మెరుగైన పెర్ఫామెన్స్ మరియు రోజూవారీ ప్రయాణాల కోసం సాటిలేని మైలేజ్ వంటి ఫీచర్లతో హోండా ఈ కొత్త బైక్‌ను అభివృద్ధి చేసింది. హోండా సిబి ట్రిగ్గర్ 150సీసీ బైక్‌లో ఈ సెగ్మెంట్లో కెల్లా మొట్టమొదటి సారిగా కాంబి బ్రేక్ సిస్టమ్‌ (సిబిఎస్)ను ఇందులో ఆఫర్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇంకా ఇందులో వినూత్నమైన 3డి హోండా యాంబ్లమ్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, డిజిటల్ అడ్వాన్స్‌డ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, ఎల్‌ఈడి టెయిల్ లైట్, హై క్వాలిటీ మోనో సప్సెన్షన్, 240 మి.మీ. ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 220 మి.మీ. రియర్ డిస్క్ బ్రేక్, వెడల్పాటి ట్యూబ్‌లెస్ టైర్స్, మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీ, విస్కౌస్ ఎయిర్ ఫిల్టర్ వంటి ఫీచర్లున్నాయి.

ఈ బైక్ మూడు ఆకర్షణీయమైన రంగుల్లో (మెటోర్ గ్రీన్ మెటాలిక్, పెరల్ సీనా రెడ్ మరియు బ్లాక్ కలర్స్) లభ్యం కానుంది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
1. స్టాండర్డ్ (ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్) - రూ.70,391
2. డీలక్స్ (ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్) - రూ.73,444
3. సిబిఎస్ (ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, సిబిఎస్) - రూ.80,060

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

More from DriveSpark

Article Published On: Thursday, June 20, 2013, 8:45 [IST]
English summary
Honda Motorcycle & Scooter India Pvt. Ltd. (HMSI) - the only 2Wheeler company of Honda in India has today further fortified its presence in the premium 150cc segment with the launch of its new performance motorcycle - CB Trigger in Andhra Pradesh.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+