హోండా నుంచి సరికొత్త 150సీసీ బైక్ 'సిబి ట్రిగ్గర్'
భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఇటీవల బడ్జెట్ మోటార్‌సైకిల్ 'డ్రీమ్‌యుగ'ను ప్రవేశపెట్టిన జపనీస్ మోటార్‌సైకిల్ కంపెనీ 'హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్' (హెచ్ఎమ్ఎస్ఐ) తాజాగా దేశీయ విపణిలో మరొక శక్తివంతమైన 150సీసీ మోటార్‌సైకిల్‌ను ప్రవేశపెట్టింది. 'సిబి ట్రిగ్గర్' (CB Trigger) అనే పేరుతో హెచ్ఎమ్ఎస్ఐ ప్రవేశపెట్టిన ఈ పవర్‌ఫుల్ బైక్‌లో ఈ సెగ్మెంట్లో కెల్లా మొట్టమొదటి సారిగా కాంబి బ్రేక్ సిస్టమ్‌ను ఇందులో అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది.
హోండా సిబి ట్రిగ్గర్‌లో శక్తివంతమైన 150సీసీ ఇంజన్‌ను ఉపయోగించినప్పటికీ ఇది మైలేజ్‌లో ఎక్కడా రాజీ పడదని, తమ కొత్త బైక్ లీటరు పెట్రోల్‌కు 60 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని హెచ్ఎమ్ఎస్ఐ ఆపరేటింగ్ ఆఫీసర్ షింజి అవోయమ తెలిపారు. ఇందులో అమర్చిన 149సీసీ ఫోర్-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 13.81 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 6500 ఆర్‌పిఎమ్ వద్ద 12.5 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.
ఈ సెగ్మెంట్లో బజాజ్ పల్సర్ 150, టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 మోడళ్లను టార్గెట్ చేస్తూ, హోండా విడుదల చేసిన తమ సరికొత్త సిబి ట్రిగ్గర్ 150 మోటార్‌సైకిల్‌లో వినూత్నమైన 3డి హోండా యాంబ్లమ్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, డిజిటల్ అడ్వాన్స్‌డ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, ఎల్‌ఈడి టెయిల్ లైట్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఇది మూడు ఆకర్షణీయ రంగుల్లో లభ్యం కానుంది. ఏప్రిల్ 2013 చివరి నాటికి ఈ మోటార్‌సైకిల్‌ను వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకువస్తామని, ఈ బైక్ ధరను కూడా అప్పుడే నిర్ణయిస్తామని కంపెనీ తెలిపింది.

హోండా సిబి ట్రిగ్గర్

హోండా సిబి ట్రిగ్గర్

హోండా సిబి ట్రిగ్గర్

హోండా సిబి ట్రిగ్గర్

హోండా సిబి ట్రిగ్గర్

హోండా సిబి ట్రిగ్గర్

హోండా సిబి ట్రిగ్గర్

హోండా సిబి ట్రిగ్గర్



Click it and Unblock the Notifications








