లిమిటెడ్ ఎడిషన్ 2013 హోండా సిబిఆర్ 250ఆర్ విడుదల

కొత్త మోడళ్ల రాకతో హై-ఎండ్ స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్లో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఎస్ఐ) సిద్ధమయింది. ఇందులో భాగంగా కంపెనీ అందిస్తున్న 'హోండా సిబిఆర్ 250ఆర్'లో ఓ కొత్త లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

హోండా సిబిఆర్ 250ఆర్ రెప్సోల్ అనే ఓ లిమిటెడ్ ఎడిషన్‌ను వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది. రేసింగ్ మోటార్‌సైకిళ్ల నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన బాడీగ్రాఫిక్స్ ఈ కొత్త బైక్ ప్రత్యేకత. ఇది కేవలం టాప్-ఎండ్ వేరియంట్ (ఏబిఎస్ వెర్షన్)లో మాత్రమే లభ్యమవుతుంది.

సిబిఆర్ 250ఆర్ రెప్సోల్ లిమిటెడ్ ఎడిషన్‌తో పాటుగా ఈ మోడల్‌లో మూడు సరికొత్త కలర్ ఆప్షన్లను కంపెనీ ప్రవేసపెట్టింది. 2013 హోండా సిబిఆర్ 250ఆర్ స్పోర్ట్స్ బైక్ ఇప్పుడు స్పోర్ట్స్ రెడ్ (మొత్తం రెడ్ కలర్, ఇంతకు ముందు ఉన్న రెడ్ అండ్ సిల్వర్ మాదిరిగా కాకుండా), స్పోర్ట్స్ బ్లాక్ (మొత్తం బ్లాక్, ఇంతకు ముందు ఉన్న బ్లాక్ అండ్ సిల్వర్ మాదిరిగా కాకుండా), పెరల్ సన్‌బీమ్ వైట్ (కొత్త హెచ్ఆర్‌సి పెయింట్ జాబ్) కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది.

కొత్త 2013 హోండా సిబిఆర్ 250ఆర్ బైక్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. కేవలం కాస్మోటిక్ మార్పులు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఉపయోగించిన ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 25 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 7000 ఆర్‌పిఎమ్ వద్ద 23 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్పోర్ట్స్ బైక్ కలర్ ఆప్షన్స్ మరియు ధరలు క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

హోండా సిబిఆర్ 250ఆర్ రెప్సోల్

హోండా సిబిఆర్ 250ఆర్ రెప్సోల్

హోండా సిబిఆర్ 250ఆర్ రెప్సోల్ (ఏబిఎస్) - రూ.1,92,850

2013 హోండా సిబిఆర్ 250ఆర్ స్పోర్ట్స్ రెడ్

2013 హోండా సిబిఆర్ 250ఆర్ స్పోర్ట్స్ రెడ్

హోండా సిబిఆర్ 250ఆర్ స్పోర్ట్స్ రెడ్ (స్టాండర్డ్) - రూ.1,56,900

హోండా సిబిఆర్ 250ఆర్ స్పోర్ట్స్ రెడ్ (ఏబిఎస్) - రూ.1,85,900

2013 హోండా సిబిఆర్ 250ఆర్ స్పోర్ట్స్ బ్లాక్

2013 హోండా సిబిఆర్ 250ఆర్ స్పోర్ట్స్ బ్లాక్

హోండా సిబిఆర్ 250ఆర్ స్పోర్ట్స్ బ్లాక్ (స్టాండర్డ్) - రూ.1,56,900

హోండా సిబిఆర్ 250ఆర్ స్పోర్ట్స్ బ్లాక్ (ఏబిఎస్) - రూ.1,85,900

2013 హోండా సిబిఆర్ 250ఆర్ పెరల్ సన్‌బీమ్ వైట్

2013 హోండా సిబిఆర్ 250ఆర్ పెరల్ సన్‌బీమ్ వైట్

హోండా సిబిఆర్ 250ఆర్ పెరల్ సన్‌బీమ్ వైట్ (స్టాండర్డ్) - రూ.1,57,900

హోండా సిబిఆర్ 250ఆర్ పెరల్ సన్‌బీమ్ వైట్ (ఏబిఎస్) - రూ.1,86,900

2013 హోండా సిబిఆర్ 250ఆర్ కలర్ ఆప్షన్స్

2013 హోండా సిబిఆర్ 250ఆర్ కలర్ ఆప్షన్స్

స్పోర్ట్స్ రెడ్

స్పోర్ట్స్ బ్లాక్

పెరల్ సన్‌బీమ్ వైట్

రెప్సోల్

More from DriveSpark

Article Published On: Thursday, June 27, 2013, 13:48 [IST]
English summary
The 2013 Honda CBR 250R is now available in the famous Repsol racing livery, seen on Honda MotoGP bikes. The model will be a limited production and will be available only with the ABS variant. Besides the Repsol racing livery, the 2013 CBR 250R is now also being offered in three new colours - black, white and red - minus the silver dual tone.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+