హోండా సిబిఆర్300ఆర్: స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

By Ravi

గడచిన అక్టోబర్ నెలలో చైనాలో జరిగిన అంతర్జాతీయ మోటార్‌సైకిల్ వర్తక ప్రదర్శనలో (సిమామోటార్) జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా మోటార్స్ ఆవిష్కరించిన తమ అధునాతన 'హోండా సిబిఆర్300ఆర్' (Honda CBR300R) స్పోర్ట్స్ బైక్‌ను తాజాగా ఇటలీలోని మిలాన్‌లో జరుగుతున్న ఈఐసిఎమ్ఏ షోలో కూడా కంపెనీ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా హోండా తం సిబిఆర్300ఆర్ బైక్‌‌కు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడి చేసింది.

ఈ అధునాతన హోండా సిబిఆర్300ఆర్ చైనా కోసం మాత్రమే డిజైన్ చేసిన ఎక్స్‌క్లూజివ్ మోడల్ కాదు.ఈ ఫొటోల్లో కనిపిస్తున్న హోండా సిబిఆర్300ఆర్ స్పోర్ట్స్ బైక్ ఓ గ్లోబల్ మోడల్. అంటే, ఇది భారత్‌కు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హోండా అందిస్తున్న 250సీసీ వెర్షన్ సిబిఆర్250ఆర్ స్థానంలో ఈ అధునాతన మరియు పవర్‌ఫుల్ 300సీసీ వెర్షన్ సిబిఆర్250ఆర్‌ను ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది.

హోండా సిబిఆర్300ఆర్‌ బైక్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

హోండా సిబిఆర్300ఆర్: స్పెసిఫికేషన్స్

హోండా సిబిఆర్1000ఆర్ నుంచి స్ఫూర్తి పొంది హోండా సిబిఆర్300ఆర్ బైక్‌ను అభివృద్ధి చేశారు. ఇది ట్విన్ హెడ్‌ల్యాంప్స్ మరియు విభిన్నంగా డిజైన్ చేయబడిన ఎగ్జాస్ట్ క్యాన్‌తో లభిస్తుంది.

హోండా సిబిఆర్300ఆర్: స్పెసిఫికేషన్స్

హోండా సిబిఆర్300ఆర్ బైక్‌లో 286సీసీ వెర్షన్ ఇంజన్‌ను ఉపయోగించారు. దీనిని పాత 250సీసీ ఇంజన్ ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేశారు. మునుపటి వెర్షన్ ఇంజన్‌తో పోల్చుకుంటే ఇది అధనంగా 37సీసీ డిస్‌ప్లేస్‌మెంట్, 8 మి.మీ. స్ట్రోక్‌ను (63 మి.మీ.) పెంచారు. బోర్‌ను యధావిధిగా (76 మి.మీ.) ఉంచారు.

హోండా సిబిఆర్300ఆర్: స్పెసిఫికేషన్స్

కొత్త హోండా సిబిఆర్300ఆర్ బైక్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద 30.4 హెచ్‌పిల శక్తిని, 7250 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. (హోండా సిబిఆర్250ఆర్ 26 హెచ్‌‌పిల శక్తిని, 23.86 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది).

హోండా సిబిఆర్300ఆర్: స్పెసిఫికేషన్స్

పెద్ద ఇంజన్ కారణంగా పెరిగిన బరువు, వైబ్రేషన్‌ను హ్యాండిల్ చేసేందుకు హెవీ బ్యాలెన్సర్ షాఫ్ట్‌ను ఇందులో అమర్చారు. ఇంజన్ మౌంట్స్‌ను మరింత ధృఢంగా తీర్చిదిద్దారు.

హోండా సిబిఆర్300ఆర్: స్పెసిఫికేషన్స్

ఇందులోని డిజిటల్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను కూడా రిప్రోగ్రామ్ చేశామని, ఫలితంగా ఇది మంచి యాక్సిలరేషన్‌ను ఆఫర్ చేస్తుందని, అలాగే పెద్ద సైలెన్సర్ కారణంగా ఇది డీపర్ ఎగ్జాస్ట్ నోట్‌ను డెలివరీ చేస్తుందని హోండా తెలిపింది.

హోండా సిబిఆర్300ఆర్: స్పెసిఫికేషన్స్

ఈ కొత్త ఇంజన్ నుంచి వచ్చే అధిక పవర్‌ను సరిగ్గా ఉపయోగించుకునేందుకు గేర్ రేషియోలను కూడా హోండా మెరుగుపరచింది. ఫలితంగా హైవేలపై వెళ్తున్నప్పుడు మంచి పెర్ఫామెన్స్‌ను ఫీల్ అవటం జరుగుతుంది.

హోండా సిబిఆర్300ఆర్: స్పెసిఫికేషన్స్

హోండా సిబిఆర్300ఆర్‌ను ఫుల్ ట్యాంక్ (12.87 లీటర్లు) చేయించుకుంటే 389 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది లీటరు పెట్రోల్‌కు సుమారు 30 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

హోండా సిబిఆర్300ఆర్: స్పెసిఫికేషన్స్

హోండా సిబిఆర్300ఆర్ బైక్‌లోని ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ 37 మి.మీ. పొడవును కలిగి ఉంటాయి. వెనుక వైపు ప్రో-లింక్ మోనోషాక్ సస్పెన్షన్‌ను ఉపయోగించారు.

హోండా సిబిఆర్300ఆర్: స్పెసిఫికేషన్స్

బ్రేక్స్ విషయావికి వస్తే, ముందు వైపు 296 మి.మీ. టూ-పిస్టన్ కాలిపర్ డిస్క్ బ్రేక్స్, వెనుక వైపు సింగిల్-పిస్టన్ 220 మి.మీ. డిస్క్ బ్రేక్స్‌ను జోడించారు.

హోండా సిబిఆర్300ఆర్: స్పెసిఫికేషన్స్

అయితే, ఈ కొత్త బైక్‌లో సీట్ ఎత్తు (శాడల్ హైట్)ను మాత్రం ఇది వరకటి మాదిరిగానే ఉంచారు. కానీ ఇవి మునుపటి వెర్షన్ కన్నా సన్నగా ఉంటాయి.

హోండా సిబిఆర్300ఆర్: స్పెసిఫికేషన్స్

హోండా సిబిఆర్300ఆర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా మార్చకుండా అలానే ఉంచారు.

హోండా సిబిఆర్300ఆర్: స్పెసిఫికేషన్స్

యూరప్ మార్కెట్లలో ఈ బైక్‌లో ఏబిఎస్ ఫీచర్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేయనున్నారు (ఎందుకంటే, ఇది అక్కడ తప్పనిసరి కాబట్టి). ఇతర మార్కెట్లలో మాత్రం ఏబిఎస్ ఆప్షనల్‌గా ఉండనుంది. దీని ధరను ఇంకా వెల్లడించలేదు.

More from DriveSpark

Article Published On: Wednesday, November 6, 2013, 11:41 [IST]
English summary
Honda did reveal to us the 2014 CBR300R, the possible successor to the CBR250R at the CIMAMotor show in China. The bike has once again been revealed for its European customers at the EICMA, but this time with full engine specifications and other details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+