హోండా సిడి 110 డ్రీమ్ విడుదల; ధర రూ.41,100
జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా భారత మార్కెట్లో మరో సరికొత్త బడ్జెట్ మోటార్‌సైకిల్ 'హోండా సిడి 110 డ్రీమ్' (Honda CD 110 Dream)ను విడుదల చేసింది. దేశీయ విపణిలో దీని ధర కేవలం రూ.41,100 (ఎక్స్-షోరూమ్) మాత్రమే. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నుంచి లభిస్తున్న అత్యంత చవకైన మోటార్‌సైకిల్ ఇదే కావటం విశేషం.
హోండా సిడి 110 డ్రీమ్ మోటార్‌సైకిల్‌ను కంపెనీ తాజాగా పరిచయం చేసిన హోండా ఈకో టెక్నాలజీ (హెచ్ఈటి)తో అభివృద్ధి చేశారు. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరు పెట్రోల్‌కు 74 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఇందులో ఉపయోగించిన 110సీసీ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.25 బిహెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.63 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా సిడి 110 డ్రీమ్ మోటార్‌సైకిల్ సింపుల్ లుక్‌ను కలిగి ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్‌పై సింపుల్ గ్రాఫిక్స్, బ్లాక్ కలర్ ఇంజన్, సిల్వర్ కోటెడ్ ఇంజన్ స్లీవ్స్, సిల్వర్ కలర్ అల్లాయ్ వీల్స్, మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీ, ట్యూబ్‌లెస్ టైర్స్, విస్కౌస్ ఎయిర్ ఫిల్టర్, డ్రమ్ బ్రేక్స్ వంటి ఫీచర్లు ఈ బైక్ సొంతం. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 179 మి.మీ., వీల్‌బీస్ 1258 మి.మీ.
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తమ సిడి 110 డ్రీమ్ బైక్‌ను ఆగస్ట్ 2014 నాటికి మార్కెట్లో వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకురానుంది. ఇది బ్లాక్ విత్ రెడ్ స్ట్రైప్స్, బ్లాక్ విత్ బ్లూ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గ్రే స్ట్రైప్స్ అనే మూడు ఆకర్షనీయమైన రంగులలో లభ్యం కానుంది. ఇది కిక్/డ్రమ్/స్పోక్ వేరియంట్లలో లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications








