ఆటో ఎక్స్‌పో 2014: హోండా సిఎక్స్-01 మోటార్‌సైకిల్ కాన్సెప్ట్
సాధారణంగా క్రాసోవర్ అనే పేరు కార్లకు మాత్రమే వర్తిస్తుంది. ఎస్‌యూవీ లాంటి ఓ పవర్‌ఫుల్ వాహనాన్ని హ్యాచ్‌బ్యాక్ లాంటి ఓ కాంపాక్ట్ కారును కలబోసి తయారు చేస్తే పుట్టేదే క్రాసోవర్. సరే, ఈ నాలుగు చక్రాల క్రాసోవర్ గురించి కాసేపు పక్కనపెట్టి, రెండు చక్రాల క్రాసోవర్‌ను ఎప్పుడైనా చూశారా? కనీసం ఎప్పుడైనా విన్నారా..? అయితే, తెలుసుకుందాం రండి..!
ఆటో ఎక్స్‌పో 2014లో బైక్ ప్రియుల మది దోచుకున్న బైక్ 'హోండా సిఎక్స్-01 కాన్సెప్ట్'. కమ్యూటర్ బైక్‌ను, స్పోర్టీ ఆఫ్-రోడర్‌ను కలిపి తయారు చేసిన బైక్ ఇది. అందుకే, దీనిని బైక్‌లలో క్రాసోవర్ అనటం జరిగింది. నేటి ఆధునిక యువతను దృష్టిలో ఉంచుకొని జపనీస్ మోటార్‌సైకిల్ కంపెనీ హోండా ఈ సరికొత్త హోండా సిఎక్స్-01 కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేసింది.
హోండా సిఎక్స్-01 కాన్సెప్ట్ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

హోండా సిఎక్స్-01 మోటార్‌సైకిల్ కాంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉండి సిటీ ట్రాఫిక్‌లో చకచకా దూసుకుపోయేందుకు సహకరిస్తుంది. అలాగే దీని హై గ్రౌండ్ క్లియరెన్స్ నిర్మాణం మరియు సస్పెన్షన్ సిస్టమ్ వలన ఆఫ్-రోడ్లపై సైతం అడ్వెంచర్ల చేసేందుకు సహకరిస్తుంది.

హోండా సిఎక్స్-01 మోటార్‌సైకిల్‌కు ప్రీమియం బైక్ హోదా కల్పించేందుకు ఇందులో ఎల్ఈడి డిస్‌ప్లే, అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్, డ్యూయెల్ ఎగ్జాస్ట్ అవుట్‌లెట్స్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్‌ను జోడించారు.

హోండా సిఎక్స్-01 మోటార్‌సైకిల్ ప్రస్తుతానికి కాన్సెప్ట్ దశలో ఉంది. ఈ కాన్సెప్ట్‌ను ఉత్పత్తి దశకు తీసుకువెళ్లే అంశంపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఆటో ఎక్స్‌పో 2014లో హోండా సిఎక్స్-01 మోటార్‌సైకిల్ కాన్సెప్ట్ ఆవిష్కరణ.


Click it and Unblock the Notifications








