హోండా సిబి ట్విస్టర్‌లో రెండు కలర్లు బంద్..
జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) గడచిన 2010లో తమ 110సీసీ మోటార్‌సైకిల్ 'సిబి ట్విస్టర్'ను మొత్తం ఐదు రంగులతో మార్కెట్‌కు పరిచయం చేసింది. ఆ తర్వాత 2011 ఇందులో పెరల్ సన్‌బీమ్ వైట్ అనే తెలుపు రంగును కూడా పరిచయం చేసింది.
అయితే, కొన్ని రకాల రంగులకు డిమాండ్ తక్కువగా కారణంగా కంపెనీ ఇందులో రెండు రంగులను నిలిపివేసినట్లు తెలుస్తోంది. హోండా టూవీలర్స్ అధికారిక సమాచారం ప్రకారం, సిబి ట్విస్టర్ ఇప్పుడు నాలుగు రంగులలో (హెవీ గ్రే మెటాలిక్, ఎలక్ట్రిక్ యల్లో మెటాలిక్, స్పోర్ట్స్ రెడ్, బ్లాక్) మాత్రమే లభ్యమవుతుంది.
ఇప్పటి వరకు అందుబాటులో ఉంచిన క్యాండీ పామ్ గ్రీమ్, పెరప్ సన్‌బీమ్ వైట్ కలర్లను కంపెనీ నిలిపివేసింది. కొత్తగా ఉత్పత్తి అయ్యే సిబి ట్విస్టర్ ఇకపై కేవలం నాలుగు రంగుల మాత్రమే లభ్యం కానున్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే, సిబి ట్విస్టర్‌లో హోండా త్వరలోనే సరికొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

ఇంజన్
హోండా సిబి ట్విస్టర్‌లో 109సీసీ, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్, ఎస్ఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 8000 ఆర్‌పిఎమ్ వద్ద 9 బిహెచ్‌పిల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 9 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మైలేజ్
హోండా సిబి ట్విస్టర్ లీటరు పెట్రోలుకు దాదాపు 60-70 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

ఫీచర్స్
స్క్రీన్‌లెస్ ఫ్రంట్ కౌల్, స్టయిలిష్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, ఫ్లోటింగ్ సైడ్ కౌల్, పవర్‌ఫుల్ 110సీసీ ఇంజన్, ట్రెండీ వీల్స్, ఫ్రంట్ డిస్క బ్రేక్, ఆకర్షనీయమైన ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్, విస్కౌస్ ఎయిర్ ఫిల్టర్, మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీ, షార్ట్ సైలెన్సర్, షార్ప్ రియర్ డిజైన్, హాఫ్ చెయిన్ కేస్.

కలర్స్
సిబి ట్విస్టర్ ఇప్పుడు నాలుగు రంగులలో మాత్రమే లభ్యమవుతుంది. అవి..
1. హెవీ గ్రే మెటాలిక్,
2. ఎలక్ట్రిక్ యల్లో మెటాలిక్
3. స్పోర్ట్స్ రెడ్
4. బ్లాక్

హైదరాబాద్‌లో హోండా సిబి ట్విస్టర్ ధరలు
హైదరాబాద్‌లో హోండా సిబి ట్విస్టర్ ధరలు ఇలా ఉన్నాయి (జులై 2013 నాటికి):
కిక్ స్టార్ట్, డ్రమ్ బ్రేక్స్, అల్లాయ్ వీల్స్ - రూ. 47,770
సెల్ఫ్ స్టార్ట్, డ్రమ్ బ్రేక్స్, అల్లాయ్ వీల్స్ - రూ. 51,388
సెల్ఫ్ స్టార్ట్, డిస్క్ బ్రేక్, అల్లాయ్ వీల్స్ - రూ. 54,587
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

గ్రీన్ కలర్ బంద్
సిబి ట్విస్టర్‌లో కంపెనీ ఆఫర్ చేస్తున్న క్యాండీ పామ్ గ్రీన్ కలర్‌ను నిలిపివేశారు.

వైట్ కలర్ బంద్
సిబి ట్విస్టర్‌లో కంపెనీ ఆఫర్ చేస్తున్న పెరల్ సన్‌బీమ్ వైట్ కలర్‌ను నిలిపివేశారు.


Click it and Unblock the Notifications








