భారత్‌లో హోండా గోల్డ్‌వింగ్ విడుదల; ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
జపాన్‌కి చెందిన ద్విచక్ర వాహన దిగ్గజం హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, భారత మార్కెట్లో ఓ సరికొత్త లీజర్, టూరింగ్ మోటార్‌సైకిల్ 'గోల్డ్‌వింగ్'ను విడుదల చేసింది. హోండా తమ 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ బైక్‌ని విడుదల చేసింది.
ప్రపంచంలో కెల్లా అత్యంత అందమైన, శక్తివంతమైన టూరింగ్ మోటార్‌సైకిళ్లలో హోండా గోల్డ్‌వింగ్ కూడా ఒకటి.
హోండా గోల్డ్‌వింగ్ ధర:
భారత విపణిలో హోండా గోల్డ్‌వింగ్ రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. వాటిలో ఒకటి ఎయిర్‌బ్యాగ్‌తో లభిస్తుంది.
- హోండా గోల్డ్‌వింగ్ - రూ.28.50 లక్షలు
- హోండా గోల్డ్‌వింగ్ - రూ.31.50 లక్షలు (ఎయిర్‌బ్యాగ్)
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

హోండా గోల్డ్‌వింగ్ స్పెసిఫికేషన్స్:
హోండా గోల్డ్‌వింగ్ మోటార్‌సైకిల్‌లో 1832సీసీ, 6-సిలిండర్, ఫోర్-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 118 హార్స్‌పవర్‌ల శక్తిని, 167 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇంతటి భారీ బైక్‌ని రివర్స్ చేయటం కష్టం కాబట్టే, ఇందులో స్లో-స్పీడ్, ఎలక్ట్రిక్ రివర్స్ సిస్టమ్ కూడా ఆఫర్ చేస్తున్నారు.

హోండా గోల్డ్‌వింగ్ ఫీచర్లు:
- ఫైవ్-పొజిషన్ హీటెడ్ గ్రిప్స్
- ఇండిపెండెంట్లీ అడ్జస్టబల్ హీటెడ్ సీట్స్
- ఫుట్-వార్మింగ్ సిస్టమ్
- లార్జర్ పాన్నీర్స్
- 6-స్పీకర్, 80వాట్ ఎస్ఆర్ఎస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్
- ఐపాడ్, ఐఫోన్, యూఎస్‌బి కనెక్టివిటీ
- ఎలక్ట్రిక్ రివర్స్ సిస్టమ్
- ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్
- 150 లీటర్ల లగేజ్ స్పేస్
- 25 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్
హోండా గోల్డ్‌వింగ్ సేఫ్టీ ఫీచర్లు:
- కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (సిబిఎస్)
- యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్)
- ఎయిర్‌బ్యాగ్ (ఆప్షనల్)


Click it and Unblock the Notifications








