హోండా సిబిఆర్150ఆర్ బైక్‌లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్

By Ravi

జపనీస్ మోటార్‌సైకిల్ బ్రాండ్ హోండా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న 150సీసీ స్పోర్ట్స్ బైక్ 'హోండా సిబిఆర్150ఆర్'లో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సెగ్మెంట్లో ఇది నేరుగా యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 మోడల్‌కు పోటీ పడనుంది.

ఇప్పటికే యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 మోడల్‌లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మార్కెట్లో విడుదలై మంచి సక్సెస్‌ను సాధించింది. ఈ నేపథ్యంలో, హోండా కూడా తమ సిబిఆర్150ఆర్ మోడల్‌లో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను పరిచయం చేయనుంది.

Honda India To Provide CBR150R With Facelift For 2015

వాస్తవానికి, కొత్త హోండా సిబిఆర్150ఆర్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో విడుదలైంది. ప్రస్తుత సిబిఆర్150ఆర్‌తో పోల్చుకుంటే, కొత్త మోడల్ డిజైన్ పరంగా కొద్దిపాటి మార్పుల చేర్పులతో రానుంది. హోండా అందిస్తున్న విఎఫ్ఆర్ ఫ్యామిలీ నుంచి స్ఫూర్తి పొంది ఈ కొత్త బైక్‌ను డిజైన్ చేశారు.

కాకపోతే.. కొత్త 2015 హోండా సిబిఆర్150ఆర్ మోడల్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం. ఇందులోని 150సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 17.5 బిహెచ్‌పిల శక్తిని, 12 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 131 కిలోమీటర్లు.

Honda CBR150R Facelift

కొత్త సిబిఆర్150ఆర్‌లో ముందు వైపు డ్యూయెల్ హెడ్‌లైట్స్, కొత్త బాడీ ప్యానెల్స్, కొత్త ఎగ్జాస్ట్ సిస్టమ్ వంటి మార్పులు కనిపిస్తాయి. అలాగే, ఈ కొత్త మోడల్ కోసం కంపెనీ కొత్త కలర్ ఆప్షన్లను కూడా పరిచయం చేసే ఆస్కారం ఉంది. కాకపోతే.. ఇండియన్ మార్కెట్ కోసం ఇందులో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) లభిస్తుందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, January 29, 2015, 9:04 [IST]
English summary
The Japanese designers will be providing their 2015 CBR150R with minor design changes. Current generation 150cc motorcycle sports styling similar to VFR family. The 2015 model, however, will sport styling similar to that of the CBR family.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+