ఫిబ్రవరిలో సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌ను విడుదల చేయనున్న హోండా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి త్రైమాసికంలో కొత్త బైక్‌లు, స్కూటర్లను విడుదల చేస్తామని వాగ్ధానం చేసిన జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా, తమ వాగ్ధానాన్ని నిలుపుకుంటూ రివైజ్డ్ ఇంజన్ టెక్నాలజీతో కూడిన అప్‌గ్రేడెడ్ డియో, ఆక్టివా, ఏవియేటర్ స్కూటర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు హోండా నుంచి త్వరలో దేశీయ విపణిలో రానున్న తర్వాతి ఉత్పత్తి 'సిబి150ఆర్'. వచ్చే నెలలో ఇది మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా.
ఇటు ఆఫ్-రోడ్ ప్రియులను అటు ఆన్-రోడ్ ప్రియులను ఆకట్టుకునేలా హోండా అభివృద్ధి చేసిన 'హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌ఫైర్' అనే స్ట్రీట్ మోటార్‌సైకిల్‌ను గడచిన సంవత్సరం ఇండోనేషియాలో జరిగిన 2012 జకార్తా మోటార్ షోలో కంపెనీ ఆవిష్కరించింది. ఆసియా మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని హోండా ఈ పవర్‌ఫుల్, స్టయిలిష్, స్లీక్ 150సీసీ బైక్‌ను తయారు చేసింది. హోండా తాజాగా మార్కెట్లో విడుదల చేసిన సిబిఆర్150ఆర్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ సిబి150ఆర్ స్ట్రీట్‌ఫైర్ బైక్‌ను అభివృద్ధి చేసింది.
హోండా సిబిఆర్150ఆర్ స్పోర్ట్స్ బైక్ వెర్షన్ కాగా, ఇందుకు నేక్డ్ వెర్షనే ఈ హోండా సిబి150ఆర్ (డిజైన్ పరంగా ఈ రెండు మోడళ్లు వేర్వేరుగా ఉంటాయి). హోండా సిబి1000ఆర్ సూపర్‌బైక్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన ఈ ఇందులో హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌ఫైర్ మోటార్‌సైకిల్‌లో శక్తివంతమైన 149.4సీసీ, డిఓహెచ్‌సి, 4-వాల్వ్, సింగిల్ సిలిండర్-లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 18 బిహెచ్‌పిల శక్తిని, 12.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఆరు గేర్లు) సిస్టమ్‌తో లభిస్తుంది.

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్
ఫిబ్రవరి నెలలో హోండా తమ కొత్త 150సీసీ బైక్ సిబి150ఆర్ స్ట్రీట్‌ఫైర్‌ను విడుదల చేయనుంది.

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్
హోండా తాజాగా మార్కెట్లో విడుదల చేసిన సిబిఆర్150ఆర్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ సిబి150ఆర్ స్ట్రీట్‌ఫైర్ బైక్‌ను అభివృద్ధి చేసింది.

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్
హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌ఫైర్ స్ట్రీట్ మోటార్‌సైకిల్‌ను గడచిన సంవత్సరం ఇండోనేషియాలో జరిగిన 2012 జకార్తా మోటార్ షోలో హోండా ఆవిష్కరించింది.

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్
హోండా సిబిఆర్150ఆర్ స్పోర్ట్స్ బైక్ వెర్షన్ కాగా, ఇందుకు నేక్డ్ వెర్షనే ఈ హోండా సిబి150ఆర్ (డిజైన్ పరంగా ఈ రెండు మోడళ్లు వేర్వేరుగా ఉంటాయి).

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్
హోండా సిబి1000ఆర్ సూపర్‌బైక్ నుంచి స్ఫూర్తి పొంది దీనిని డిజైన్ చేశారు.

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్
ఇందులో హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌ఫైర్ మోటార్‌సైకిల్‌లో శక్తివంతమైన 149.4సీసీ, డిఓహెచ్‌సి, 4-వాల్వ్, సింగిల్ సిలిండర్-లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 18 బిహెచ్‌పిల శక్తిని, 12.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఆరు గేర్లు) సిస్టమ్‌తో లభిస్తుంది.

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్
సిబిఆర్150ఆర్ బైక్‌లో ఉపయోగించిన ఫ్రేమ్, ఫ్రంట్ అండ్ రియర్ సస్పెన్షన్‌లనే సిబి150ఆర్ బైక్‌లోను ఉపయోగించనున్నారు.

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్
స్ట్రీట్ బైక్ ఫీల్‌ను కలిగించేలా దీని ఎర్గోడైనమిక్స్‌ను డిజైన్ చేశారు. ఇది నాలుగు ఆకర్షనీయమైన రంగుల్లో (వైట్, బ్లాక్, ట్రైకలర్, ఆరెంజ్) లభ్యం కానుంది.

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్
భారత మార్కెట్లో దీని ధర రూ.99,000 (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్
సిబిఆర్150ఆర్ బైక్‌లో ఉపయోగించిన ఫ్రేమ్, ఫ్రంట్ అండ్ రియర్ సస్పెన్షన్‌లనే సిబి150ఆర్ బైక్‌లోను ఉపయోగించనున్నారు. స్ట్రీట్ బైక్ ఫీల్‌ను కలిగించేలా దీని ఎర్గోడైనమిక్స్‌ను డిజైన్ చేశారు. ఇది నాలుగు ఆకర్షనీయమైన రంగుల్లో (వైట్, బ్లాక్, ట్రైకలర్, ఆరెంజ్) లభ్యం కానుంది. దేశీయ విపణిలో బజాజ్ అందిస్తున్న పల్సర్ 200ఎన్ఎస్ మోటార్‌సైకిల్‌కు ఇది గట్టి పోటీగా నిలువనుంది. హోండా అందిస్తున్న సిబిఆర్150ఆర్ ధరను కంపెనీ ఇప్పటికే అధికంగా ఉంచిన నేపథ్యంలో, ఈ సిబి150ఆర్ స్ట్రీట్ బైక్ ధరను తక్కువగా ఉంచాల్సిన అసరం ఉంది. భారత మార్కెట్లో దీని ధర రూ.99,000 (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








