ఆక్టివా, డియో, ఏవియేటర్ స్కూటర్లను అప్‌గ్రేడ్ చేసిన హోండా

జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) దేశీయ విపణిలో అందిస్తున్న తమ మూడు స్కూటర్ల (ఆక్టివా, ఏవియేటర్, డియో)ను అప్‌గ్రేడ్ చేసి మార్కెట్లో విడుదల చేసింది. 2013 వెర్షన్ హోండా ఆక్టివా, హోండా ఏవియేటర్, హోండా డియో స్కూటర్లలో ఉపయోగించిన ఇంజన్‌ను హెచ్ఎమ్ఎస్ఐ అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పుడు ఈ మూడ మోడళ్లలో 109సీసీ, ఫోర్-స్ట్రోక్, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8 బిహెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్‌ల టార్క్‌‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ అప్‌గ్రేడెడ్ 2013 స్కూటర్లలో కొత్త 'హోండా ఎకో టెక్నాలజీ' (హెచ్ఈటి)ను ఉపయోగించారు. జపాన్, థాయ్‌లాండ్, మానేసర్ (ఇండియా)లలోని హోండా ఆర్ అండ్ డి ఈ ఇంజన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీ వలన ఇంజన్ పవర్ ఏ మాత్రం తగ్గకుండా మెరుగైన మైలేజీని అందిచటంలో తోడ్పడుతుంది. ఈ టెక్నాలజీ ద్వారా హోండా స్కూటర్లు లీటరుకు 60 కి.మీ. వరకూ మైలేజీని ఆఫర్ చేస్తాయని కంపెనీ పేర్కొంది. ఇకపై భవిష్యత్తులో హోండా అందిస్తున్న అన్ని ఇంజన్లలో ఈ హెచ్ఈటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనుంది. అంతేకాకుండా, ఈ కొత్త స్కూటర్లలో కంపెనీ ఇప్పుడు సరికొత్త కలర్ ఆప్షన్లను కూడా ప్రవేశపెట్టింది.

2013 హోండా డియో

2013 హోండా డియో

హోండా ఎకో టెక్నాలజీ (హెచ్ఈటి)తో అభివృద్ధి చేసిన సరికొత్త 2013 హోండా డియోను కంపెనీ తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. ఈ సరికొత్త 2013 హోండా డియో లీటరు పెట్రోలుకు 60 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

2013 హోండా డియో - ధర

2013 హోండా డియో - ధర

దేశీయ విపణిలో 2013 హోండా డియో ధర రూ.44,701 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లుగా ఉంది.

2013 హోండా ఆక్టివా

2013 హోండా ఆక్టివా

హోండా ఎకో టెక్నాలజీ (హెచ్ఈటి)తో అభివృద్ధి చేసిన సరికొత్త 2013 హోండా ఆక్టివాను కంపెనీ తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. ఈ సరికొత్త 2013 హోండా ఆక్టివా లీటరు పెట్రోలుకు 60 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

2013 హోండా ఆక్టివా - ధర

2013 హోండా ఆక్టివా - ధర

దేశీయ విపణిలో 2013 హోండా ఆక్టివా ధర రూ.47,188 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లుగా ఉంది.

2013 హోండా ఏవియేటర్

2013 హోండా ఏవియేటర్

హోండా ఎకో టెక్నాలజీ (హెచ్ఈటి)తో అభివృద్ధి చేసిన సరికొత్త 2013 హోండా ఏవియేటర్‌ను కంపెనీ తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. ఈ సరికొత్త 2013 హోండా ఏవియేటర్ లీటరు పెట్రోలుకు 60 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

2013 హోండా ఏవియేటర్ - ధరలు

2013 హోండా ఏవియేటర్ - ధరలు

దేశీయ విపణిలో 2013 హోండా ఏవియేటర్ ధరలు రూ.48,212 (స్టాండర్డ్ వేరియంట్), రూ.53,531 (డీలక్స్ వేరియంట్)లుగా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).


సరికొత్త 2013 హోండా డియో స్కూటర్ ఇప్పుడు పసుపు రంగులో లభ్యం కానుంది. అలాగే హోండా ఆక్టివాలో ఎక్స్‌ట్రా మెటాలిక్ పర్పల్ కలర్‌ను, హోండా ఏవియేటర్‌లో కొత్త గోల్డెన్ పెయింట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. భారత మార్కెట్లో ఈ కొత్త అప్‌గ్రేడెడ్ హోండా స్కూటర్ల ధరలు ఈ విధంగా ఉన్నాయి:

  • 2013 హోండా డియో - రూ.44,701
  • 2013 హోండా ఆక్టివా - రూ.47,188
  • 2013 హోండా ఏవియేటర్ - రూ.48,212 (స్టాండర్డ్ వేరియంట్)
  • 2013 హోండా ఏవియేటర్ - రూ.53,531 (డీలక్స్ వేరియంట్)

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

Most Read Articles

English summary
Honda Motorcycles and Scooters India, the leading manufacturer of automatic scooters in India has refreshed its line-up of scooters. Honda's new scooters get several updates but the most notable one is the Honda-Eco-Technology which will help improve their mileage to an impressive 60kmpl.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X