ఇండోనేషియాలో 2015 హోండా సిబిఆర్150ఆర్ విడుదల
జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఎస్ఐ) దేశీయ విపణిలో విక్రయిస్తున్న 150సీసీ స్పోర్ట్స్ బైక్ 'హోండా సిబిఆర్ 150ఆర్' (Honda CBR 150R) త్వరలోనే కొత్త రూపంలో కనిపించనుంది.
హోండా తొలిసారిగా తమ సిబిఆర్ 150ఆర్ బైక్‌ను జనవరి 2012లో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఆ తర్వాత మార్చ్ 2012లో ఈ బైక్‌ను వాణిజ్య పరంగా భారత్‌లో విడుదల చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ బైక్‌లో అప్‌గ్రేడెడ్ వర్షన్ విడుదల కాలేదు.

ఈ నేపథ్యంలో, హోండా తమ సిబిఆర్ 150ఆర్ బైక్‌లో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను భారత్‌లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానిక హోండా తమ 2015 వెర్షన్ సిబిఆర్ 150ఆర్ బైక్‌ను ఇప్పటికే ఇండోనేషియా మార్కెట్లో విడుదల చేసింది.
ఈ కొత్త 2015 హోండా సిబిఆర్ 150ఆర్ చూడటానికి అచ్చం హోండా సిబిఆర్ 300ఆర్ మాదిరిగానే ఉంటుంది. ఇది ఈ సెగ్మెంట్లో నేరుహా యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 మోడల్‌తో తలపడనుంది. ఈ కొత్త బైక్‌లో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా కొద్దిపాటి మెకానికల్ అప్‌గ్రేడ్స్ కూడా ఉన్నాయి.

అయితే, ఇదివరకటి మోడల్‌లో ఉపయోగించిన సస్పెన్షన్ కన్నా మెరుగ్గా ఉండేలా ఈ కొత్త 2015 వెర్షన్ సిబిఆర్ 150ఆర్‌లో ప్రో-లింక్ సస్పెన్షన్‌ను ఉపయోగించారు. అదే 149.4సీసీ, సింగిల్-సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఇందులో అమర్చారు.
ఈ బైక్ క్రోమ్ ప్లేటెడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌తో లభిస్తుంది. దీని ఈసియూ సెట్టింగ్ రీవ్యాంప్ చేశారు. ఫలితంగా ఇది 16.85 హెచ్‌పిల శక్తిని, 13 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








