హోండా నుంచి అత్యంత చవక బైక్ 'డ్రీమ్ నియో' విడుదల

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా భారత మార్కెట్లో తమ అత్యంత చవక మోటార్‌‌సైకిల్‌ను ప్రవేశపెట్టింది. ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న 'హీరో స్ప్లెండర్'ను సవాల్ చేస్తూ హోండా తమ 'డ్రీమ్ నియో' బడ్జెట్ బైక్‌ను విడుదల చేసింది. దేశీయ విపణిలో హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ.43,150 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. దీంతో దేశంలో హోండా నుంచి లభిస్తున్న అత్యంత చవకైన బైక్‌గా డ్రీమ్ నియో నిలిచింది.

హోండా డ్రీమ్ నియోలో ఇది వరకు చెప్పుకున్నట్లుగా 100సీసీ ఇంజన్‌ను కాకుండా, రీట్యూన్ చేయబడిన 109సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 74 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో అమర్చిన 109సీసీ, ఫోర్-స్ట్రోక్, సింగిల్-సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.25 బిహెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం 'హోండా ఎకో టెక్నాలజీ' (హెచ్ఈటి)ని ఈ ఇంజన్‌లో ఉపయోగించారు. ఈ టెక్నాలజీలో మెరుగైన కంబస్టియన్, నికెల్ ప్లేటెడ్ స్పార్క్ ప్లగ్ వలన ఉత్పన్నమయ్యే క్లీన్ స్పార్క్ మరియు ఆప్టిమైజ్డ్ ఇన్‌లెట్ పోర్ట్‌లు ఉంటాయి. కార్బురేటర్ ద్వారా ఇంధన సరఫరా జరిగే ఈ ఇంజన్ గరిష్ట మైలేజీనివ్వటంలో సహకరిస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ గేర్ బాక్సుతో జతచేయబడి ఉంటుంది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • హోండా డ్రీమ్ నియో (కిక్ స్టార్ట్ / డ్రమ్ బ్రేక్స్ / స్పోక్ వీల్స్) - రూ.43,150
  • హోండా డ్రీమ్ నియో (కిక్ స్టార్ట్ / డ్రమ్ బ్రేక్స్ / అల్లాయ్ వీల్స్) - రూ.44,150
  • హోండా డ్రీమ్ నియో (సెల్ఫ్ స్టార్ట్ / డ్రమ్ బ్రేక్స్ / అల్లాయ్ వీల్స్) - రూ.47,240

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఈ సెగ్మెంట్లో లభిస్తున్న హీరో స్ప్లెండర్ ప్రారంభ ధర రూ.42,950 లుగా ఉంది. అంటే, స్ప్లెండర్‌తో పోల్చుకుంటే డ్రీమ్ నియో ధర రూ.200 ధికంగా ఉంది. మే నెల మొదటి వారంలో తొలి బ్యాచ్ హోండా డ్రీమ్ నియో బైక్‌ల డెలివరీలను ప్రారంభించనున్నామని కంపెనీ పేర్కొంది.

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విడుదల

More from DriveSpark

Article Published On: Wednesday, April 17, 2013, 14:51 [IST]
English summary
Honda Motorcycle & Scooters India has launched a new motorcycle ‘Dream Neo’ in the volume-driven commuter segment, with starting price of Rs 43,150, making it the company’s cheapest two-wheeler in the country. The first batch of bikes will be dispatched by Honda in the first week of May.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+