హోండా యాక్టివా 125సీసీ స్కూటర్ విడుదల; వివరాలు
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ తమ మొట్టమొదటి 125సీసీ ఆటోమేటిక్ స్కూటర్ 'యాక్టివా 125'ను నేడు (ఏప్రిల్ 28, 2014) దేశీయ విపణిలో విడుదల చేసింది. ఇప్పటికే ఆటోమేటిక్ స్కూటర్ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న యాక్టివా బ్రాండ్‌కు తాజాగా వచ్చిన 125సీసీ వేరియంట్ మరింత జోరును అందించనుందని కంపెనీ పేర్కొంది.
ప్రస్తుతం హోండా యాక్టివా రెండు వేరియంట్లలో (110సీసీ యాక్టివా మరియు 110సీసీ యాక్టివా ఐ) లభ్యమవుతోంది. కాగా.. తాజాగా ప్రవేశపెట్టిన హోండా యాక్టివా 125 స్కూటర్ రెండు వెర్షన్లలో (స్టాండర్డ్, డీలక్స్) లభ్యం కానుంది. దీని ప్రారంభ ధర రూ.56,607 (ఎక్స్-షోరూమ్, ముంబై)గా నిర్ణయించామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

హోండా యాక్టివా 125లో పవర్‌ఫుల్ 124సీసీ, ఫోర్-స్ట్రోక్, ఫోర్స్ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ 125సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6500 ఆర్‌పిఎమ్ వద్ద 8.6 హెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10.12 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ రెగ్యులర్ వి-మ్యాటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.
స్టాండర్డ్ వేరియంట్ యాక్టివా 125 అల్లాయ్ వీల్స్, డ్రమ్ బ్రేక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. అలాగే, డీలక్స్ వేరియంట్ హోండా యాక్టివా 125 అల్లాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్ ఆప్షన్లతో లభ్యం కానుంది. డీలక్స్ వేరియంట్లో 190 మి.మీ. డ్రమ్ బ్రేక్‌ను (ముందు వైపు మాత్రమే), స్టాండర్డ్ వేరియంట్లో 130 మి.మీ. డ్రమ్ బ్రేక్స్ (ఇరు వైపులా)ను ఉపయోగించారు. ఈ రెండు వేరియంట్లు కూడా హోండా యొక్క కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (సిబిఎస్)తో లభిస్తాయి.

యాక్టివా 125లో ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. దీని ఫలితంగా ముందు వైపు చక్రం 12 ఇంచ్‌లు మరియు వెనుక వైపు చక్రం 10 ఇంచ్‌ల పరిమాణానాన్ని కలిగి ఉంటుంది. హోండా యాక్టివా 125 స్కూటర్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, పెరల్ వైట్, మెటాలిక్ సిల్వర్ అనే రంగుల్లో లభిస్తుంది. ఇందులో హెచ్ఈటి టెక్నాలజీ, కాంబి బ్రేక్ సిస్టమ్, ట్యూబ్‌లెస్ టైర్స్, డిజిటల్ మీటర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం ఇది లీటరుకు 59 కి.మీ. మైలేజీనిస్తుంది.


Click it and Unblock the Notifications








