కొత్త సంవత్సరంలో విడుదల కానున్న హోండా సిబిఆర్500ఆర్
హోండా సిబిఆర్ ఫ్యాన్స్‌కి ఓ స్వీట్ న్యూస్. జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, దేశీయ విపణిలో మరో సరికొత్త స్పోర్ట్స్ బైక్‌ను విడుదల చేయబోతుంది. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న సిబిఆర్ సిరీస్‌లో 500సీసీ ఇంజన్‌తో కూడిన కొత్త 'హోండా సిబిఆర్500ఆర్' (Honda CBR500R ) బైక్‌ను హోండా 2014లో విడుదల చేయనుంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో హోండా ఈ కొత్త బైక్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది. దీంతో పాటుగా మరికొన్ని హై-ఎండ్ బైక్‌లను, కొత్త సిబిఆర్ సిరీస్ బైక్‌లను కూడా ప్రదర్శించనుంది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రస్తుతం దేశీయ విపణిలో సిబిఆర్ సిరీస్‌లో సిబిఆర్150ఆర్, సిబిఆర్250ఆర్ (ఏబిఎస్, నాన్-ఏబిఎస్) మోడళ్లను విక్రయిస్తోంది.
ఈ సిరీస్‌లోకి తాజాగా వచ్చిన చేరనున్న కొత్త హోండా సిబిఆర్500ఆర్ స్పోర్ట్స్ బైక్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి..!

హోండా నుంచి కొత్తగా రానున్న ఈ పవర్‌ఫుల్ సిబిఆర్500ఆర్ బైక్‌లో 500సీసీ, పారలల్ ట్విన్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 47 బిహెచ్‌పిల శక్తిని, 43 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త హోండా సిబిఆర్500ఆర్ కేవలం 5.7 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 185 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

భారత మార్కెట్లో కొత్త హోండా సిబిఆర్500ఆర్ బైక్ కూడా ఏబిఎస్, నాన్-ఏబిఎస్ ఫీచర్లతో లభ్యం కావచ్చని తెలుస్తోంది. దేశీయ విపణిలో దీని ధర రూ.4 లక్షలకు దిగువన ఉండొచ్చని అంచనా.

హోండా సిబిఆర్500ఆర్ ఈ సెగ్మెంట్లోని కవాసకి నిన్జా500, కెటిఎమ్ డ్యూక్390 వంటి మోడళ్లతో పోటీ పడే అవకాశం ఉంది. ఈ బైక్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








