హోండా ఎన్ఎమ్4 వుల్టస్ సూపర్‌బైక్ ఆవిష్కరణ
జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా గతకొద్ది కాలంగా రహస్యంగా అభివృద్ధి చేస్తున్న ఓ అధునాతన మోటార్‌సైకిల్‌ను కంపెనీ అధికారికంగా ఆవిష్కరించింది. ఈ బైక్ పేరు 'హోండా ఎన్ఎమ్4 వుల్టస్' (Honda NM4 Vultus). ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ బైక్, కానీ ఇందులో ఇప్పటికే ప్రొడక్షన్ వెర్షన్ కూడా ప్రారంభమైనట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: వెస్పా ఎస్125 స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న కాన్సెప్ట్ వెర్షన్ హోండా ఎన్ఎమ్4 వుల్టస్‌కు అలాగే ప్రొడక్షన్ వెర్షన్‌కు చాలా దగ్గర పోలికలు ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఈ బైక్ పేరులో వుల్టస్ అంటే లాటిన్ భాషలో ఎక్స్‌ప్రెషన్, అప్పీరెన్స్ లేదా ఫేస్ అని అర్థం. పేరుకు తగినట్లుగానే ఇది విశిష్టమైన డిజైన్‌తో ఫ్యూచరిస్టిక్ లుక్‌ను కలిగి ఉంటుంది.

నిలువుగా ఉండే రెండు హెడ్‌ల్యాంప్స్, విశిష్టమైన టర్న్ ఇండికేటర్స్‌తో ఇది మోడ్రన్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. హోండాకు చెందిన యువ ఇంజనీర్లు ఈ బైక్‌ను డిజైన్ చేశారు. అర్బన్ ఆడియెన్స్‌ను లక్ష్యంగా చేసుకొని అలాగే ఓ కొత్త బ్రీడ్ రైడర్‌ను సృష్టించాలనే సంకల్పంతో ఈ సరికొత్త హోండా ఎన్ఎమ్4 వుల్టస్ బైక్‌ను తయారు చేశారు.
హోండా ఎన్ఎమ్4 వుల్టస్ గ్రేట్ స్కెలిటన్/ఛాస్సిస్ మరియు పవర్ ప్యాక్డ్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 745సీసీ, ట్విన్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. హోండా దీనిని తమ లో ఫ్రిక్షన్ టెక్నాలజీ ఆధారంగా తయారు చేసింది. ఇది సుపీరియర్ లో అండ్ మిడ్-రేంజ్ టార్క్‌లను మరియు పవర్‌ను కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది.

హోండా తమ ఎన్ఎమ్4 వుల్టస్ బైక్‌లో డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇది పవర్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మెరుగైన మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఇందులో ఎస్ అండ్ డి మోడ్స్‌తో ఓ ఆటోమేటిక్ ట్విస్ట్ అండ్ గో ఆప్షన్ ఉంటుంది. ఇందులో మ్యాన్యువల్ మోడ్‌ను కూడా ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications








