హోండా సరికొత్త 150సీసీ స్కూటర్.. మీకు కావాలా..?

By Ravi

జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా, భారత ద్విచక్ర వాహన మార్కెట్లో అగ్రస్థానంపై కన్నేస్తోంది. ఇప్పటికే, స్కూటర్ సెగ్మెంట్లో పటిష్టమైన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోతో నెంబర్ వన్‌గా హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్, ఈ సెగ్మెంట్లో మరిన్ని కొత్త మోడళ్లను ప్రవేశపెట్టి, తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది.

ఇందులో భాగంగానే.. హోండా గడచిన సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచిన 150సీసీ స్కూటర్ 'హోండా పిసిఎక్స్'ను కంపెనీ ఇండియన్ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం హోండా ఇప్పటికే పిసిఎక్స్ స్కూటర్‌ను ఇండియాకు దిగుమతి చేసుకున్నట్లు సమాచారం.

హోండా పిసిఎక్స్ 150సీసీ స్కూటర్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకోండి..!

హోండా పిసిఎక్స్ 150సీసీ స్కూటర్

హోండా పిఎసిఎక్స్ 150 ఈ సెగ్మెంట్లో హీరో మోటోకార్ప్ తీసుకురానున్న హీరో జిర్ 150సీసీ స్కూటర్‌తో పోటీ పడనుంది.

హోండా పిసిఎక్స్ 150సీసీ స్కూటర్

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సాంప్రదాయ స్కూటర్లతో పోల్చుకుంటే, హోండా పిసిఎక్స్ 150 చాలా పెద్దదిగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఇది చాలా మోడ్రన్‌గా, స్టయిలిష్‌గా ఉంటుంది.

హోండా పిసిఎక్స్ 150సీసీ స్కూటర్

సాధారణ 110సీసీ స్కూటర్లు సుమారు 100-110 కేజీల బరువును కలిగి ఉంటే, ఈ హోండా పిసిఎక్స్ 150సీసీ స్కూటర్ దాదాపు 130 కిలోల బరువును కలిగి ఉంటుంది.

హోండా పిసిఎక్స్ 150సీసీ స్కూటర్

హోండా పిసిఎక్స్ 150 స్కూటర్‌లో 153సీసీ, సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, ఎస్ఓహెచ్‌సి, లిక్విడ్ కూల్డ్, పిజిఎమ్-ఎఫ్ఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద 13.4 బిహెచ్‌‌పిల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద 14 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ వి-మ్యాటిక్ అటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

హోండా పిసిఎక్స్ 150సీసీ స్కూటర్

హోండా పిసిఎక్స్ 150 స్కూటర్ ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 8 లీటర్లు. వెడల్పాటి హెడ్‌లైట్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

హోండా పిసిఎక్స్ 150సీసీ స్కూటర్

మోటార్‌సైకిల్ లాంటి హ్యాండిల్ బార్, అల్లాయ్ వీల్స్, చైర్ లైక్ సీటింగ్ పొజిషన్, అనలాగ్ అండ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటల్ ప్యానెల్, డిస్క్ బ్రేక్ వంటి పలు ఫీచర్లు ఈ స్కూటర్ సొంతం.

హోండా పిసిఎక్స్ 150సీసీ స్కూటర్

దేశీయ విపణిలో హోండా పిసిఎక్స్ 150 స్కూటర్ ధర సుమారు రూ.70,000 నుంచి రూ.75,000 రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
Japanese two wheeler manufacturer Honda is planning to launch PCX 150cc Scooter in India. 
Story first published: Tuesday, January 20, 2015, 20:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X