హోండా డాక్టర్ యాక్టివా సర్వీస్ ఆన్ వీల్స్
అర్బన్ మార్కెట్లలో మంచి బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా, ఇప్పుడు గ్రామీణ మార్కెట్లపై దృష్టి సారించింది. సరైన సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉండని రూరల్ మార్కెట్ల కోసం కంపెనీ ఓ కొత్త ప్రణాళికను ప్రారంభించింది.
'డాక్టర్ యాక్టివా సర్వీస్ ఆన్ వీల్స్' పేరిట హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఓ ప్రణాళికను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా, హోండా తమ వెహికల్ రిపేర్, సర్వీస్ ప్రోగ్రామ్‌లను మరింత మెరుగుపరచనుంది. హోండా డాక్టర్ యాక్టివా ప్రోగ్రామ్‌లో భాగంగా, ప్రజల ఇంటి వద్దకే సర్వీసింగ్ సేవలను తీసకువచ్చే వెసలుబాటును కంపెనీ కల్పించనుంది.

మార్చ్ నెలాఖరు నాటికి 785 హోండా డీలర్‌షిప్ కేంద్రాలకు ఓ ప్రత్యేకమైన యాక్టివా ఆటోమేటిక్ స్కూటర్‌ను కేటాయించనున్నారు. అన్ని రకాల హోండా ద్విచక్ర వాహనాల్లో తలెత్తే చిన్నపాటి సమస్యలను మొదలకొని పెద్ద సమస్యలను సైతం సరిచేసేందుకు కావల్సిన అన్ని పరికరాలను ఈ హోండా డాక్టర్ యాక్టివా స్కూటర్లలో అందుబాటులో ఉంచుతారు.
ఈ స్కూటర్‌ను నిపుణులైన మెకానిక్‌లు నడుపుతూ, కస్టమర్లు ఎక్కడికి పిలిస్తే అక్కడి వెళ్లి సర్వీసింగ్ చేస్తుంటారు. హోండా ఇప్పటికే ఇదే తరహాలో మొబైల్ సర్వీస్ వ్యాన్‌లను కొన్ని ప్రధాన నగరాల్లో నిర్వహిస్తోంది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సేవలు అందుబాటులో లేవు. అందుకే, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు సర్వీసింగ్ సేవలను మరింత సులువుగా యాక్సెస్ చేసుకునేలా హోండా యాక్టివా డాక్టర్ పేరిట ఈ కొత్త ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది.


Click it and Unblock the Notifications








