హోండా, శ్రీరామ్ ఆటోమాల్ నుంచి సెకండ్ హ్యాండ్ టూవీలర్స్

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) మరియు శ్రీరామ్ ఆటోమాల్ సంస్థలు తాజాగా ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా, ఇరు సంస్థలు కలిసి ప్రీ-ఓన్డ్ (సెకండ్ హ్యాండ్) ద్విచక్ర వాహనాలను విక్రయించనున్నాయి.

ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ మోటార్‌సైకిళ్ల కొనుగోళ్లకు సంబంధించి విశ్వసనీయమైన వ్యవస్థ లేదని, ఈ ఒప్పందం ద్వారా తాము ఈ లోటను భర్తీ చేస్తామని హెచ్ఎమ్ఎస్ఐ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) వైఎస్ గులేరియా తెలిపారు.

మొత్తం అమ్మకాలలో దాదాపు 15 శాతం ప్రీ-ఓన్డ్ టూవీలర్లదేనని, కానీ ఈ విభాగంలో మరిన్ని అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రారంభంలో భాగంగా.. తాము 40 పట్టణాల నుంచి ప్రారంభించి, రానున్న మూడేళ్లలో క్రమంగా దేశవ్యాప్తంగా 100 కవర్ చేస్తామని గులేరియా తెలిపారు.

Honda Shine

ఈ ఒప్పందంలో భాగంగా రానున్న మూడేళ్లలో 3.5 లక్షల యూనిట్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టైఅప్ ద్వారా హోండా తమ ప్రీ-ఓన్డ్ ద్విచక్ర వాహనాలను విక్రయించేందుకు కావల్సిన ఏర్పాట్లను శ్రీరామ్ ఆటోమాల్ చేయనుంది.

హోండా ప్రస్తుతం తమ 'బెస్ట్ డీల్' అనే బ్రాండ్ క్రింద ప్రీ-ఓన్డ్ అవుట్‌లెట్లను నిర్వహిస్తోంది, దేశంలో ఇలాంటివి 60 అవుట్‌లెట్లు ఉన్నాయి. వచ్చే ఏడాది నాటికి ఈ సంఖ్యను 100కు పెంచాలని భావిస్తున్నట్లు గులేరియా చెప్పారు. ఈ అవుట్‌లెట్ల ద్వారా సాలీనా 20,000 యూనిట్లను విక్రయిస్తున్నట్లు ఆయన వివరించారు.

Most Read Articles

English summary
Honda Motorcycle & Scooter India (HMSI) has tied up with Shriram Automall India for selling pre-owned two-wheelers in the country. Through the tie-up, the partners aim to sell 3.5 lakh two wheeler units in the next three years.
Story first published: Friday, January 23, 2015, 9:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X