హోండా సిబిఎఫ్ స్టన్నర్ పిజిఎమ్-ఎఫ్ఐ ఉత్పత్తి నిలిపివేత
జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) దేశీయ విపణిలో అందిస్తున్న 125సీసీ మోటార్‌సైకిల్ 'హోండా సిబిఎఫ్ స్టన్నర్'లో ఓ వేరియంట్‌ను కంపెనీ నిలిపివేసింది. ఇప్పటి వరకూ ఈ బైక్ రెండు వేరియంట్లలో (ఫ్యూయెల్ ఇంజక్షన్ వేరియంట్, కార్బురేటెడ్ వేరియంట్) లభ్యమవుతుండేది. అయితే ఇప్పుడు ఇందులో సిబిఎఫ్ స్టన్నర్ పిజిఎమ్-ఎఫ్ఐ (ఫ్యూయెల్ ఇంజక్షన్ వేరియంట్) ఉత్పత్తిని హెచ్ఎమ్ఎస్ఐ నిలిపివేసింది. ఇప్పుడు సిబిఎఫ్ స్టన్నర్ కేవలం కార్బురేటెడ్ వేరియంట్‌లో మాత్రమే లభ్యం కానుంది.
హోండా ఈ వేరియంట్‌ను నిలిపివేయటానికి ప్రధాన కారణం ఫ్యూయెల్ ఇంజక్షన్, కార్బురేటెడ్ వేరియంట్లకు మధ్య ఉన్న ధర వ్యత్యాసమే. హోండా సిబిఎఫ్ స్టన్నర్ పిజిఎమ్-ఎఫ్ఐ వేరియంట్ ధర రూ.65,845 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండగా, హోండా సిబిఎఫ్ స్టన్నర్ కార్బురేటెడ్ వేరియంట్ ధర రూ.56,348 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. హోండా సిబిఎఫ్ స్టన్నర్ పిజిఎమ్-ఎఫ్ఐ వేరియంట్ ధర హోండా అందిస్తున్న 150సీసీ బైక్ సిబి యునికార్న్ ధర కన్నా కూడా అధికం. హోండా సిబి యునికార్న్ ధర రూ.60,002 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
హోండా సిబిఎఫ్ స్టన్నర్‌లో ఉపయోగించిన 124.7సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 8000 ఆర్‌పిఎమ్ వద్ద 11 బిహెచ్‌పిల శక్తిని, 6500 ఆర్‌పిఎమ్ వద్ద 11 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెర్ఫామెన్స్, స్టయిలింగ్ అంశాల పరంగా ఫ్యూయెల్ ఇంజక్షన్ వేరియంట్, కార్బురేటెడ్ వేరియంట్లలో పెద్దగా తేడా లేకపోవటంతో పిజిఎమ్-ఎఫ్ఐ వేరియంట్ అమ్మకాలు కూడా మందకొడిగా సాగుతుండటంతో కంపెనీ ఈ వేరియంట్ ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

హోండా సిబిఎఫ్ స్టన్నర్

హోండా సిబిఎఫ్ స్టన్నర్

హోండా సిబిఎఫ్ స్టన్నర్

హోండా సిబిఎఫ్ స్టన్నర్

హోండా సిబిఎఫ్ స్టన్నర్

హోండా సిబిఎఫ్ స్టన్నర్



Click it and Unblock the Notifications








