జూన్ 12న మార్కెట్లోకి వస్తున్న హోండా కొత్త స్కూటర్

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా, భారత ద్విచక్ర వాహన సెగ్మెంట్లో అగ్రస్థానంపై కన్నేసింది. ఈ దిశలో భాగంగా అన్ని వర్గాల వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. బడ్జెట్ మోటార్‌సైకిళ్ల నుంచి ప్రీమియం బైక్‌‌ల వరకు వివిధ సెగ్మెంట్లో కంపెనీ ఉత్పత్తులను అందిస్తుంది. ఇటీవలే తమ చవక మోటార్‌సైకిల్ డ్రీమ్ నియోను ప్రవేశపెట్టిన హోండా ఇప్పుడు మరొక సరికొత్త ఉత్పత్తిని ఈనెలలో విడుదల చేయనుంది.

ఈ నెల 12న హోండా ఓ సరికొత్త ఉత్పత్తి మార్కెట్లో విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి కంపెనీ ఓ టీజర్‌ను కూడా విడదల చేసింది. ఎగిరేందుకు సిద్ధమేనా (రెడీ టూ ఫ్లై) అనే క్యాప్షన్‌తో శీతాకోక చిలుకతో ఉన్న టీజర్‌ను హోండా విడుదల చేసింది. ఈ టీజర్ ఫొటోపై జూన్ 12, 2013వ తేదీని కంపెనీ పేర్కొంది. అయితే, అంతకు మించిన సమాచారాన్ని కంపెనీ వెల్లడించలేదు.

ఈ టీజర్‌ను బట్టి చూస్తే హోండా విడుదల చేయనున్న కొత్త ఉత్పత్తి స్కూటర్ అయి ఉండొచ్చని అంచనా. 125సీసీ స్కూటర్ సెగ్మెంట్లో హోండా ఓ సరికొత్త స్కూటర్‌ను విడుదల చేసే ఆస్కారం ఉంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఈ స్కూటర్ పేరు 'యాక్టివా ఐ' అని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాలంటే, జూన్ 12 వరకు ఆగాల్సిందే. లేటెస్ట్ అప్‌డేస్ట్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Honda To Launch Another New Product On June 12

More from DriveSpark

Article Published On: Thursday, June 6, 2013, 16:47 [IST]
English summary
After Dream Neo launch, Honda Motorcycle and Scooters India (HMSI) is yet to launch another new product on 12th June 2013. In this regard, company has released a teaser image saying "Ready to fly" but no other details have been mentioned. Stay tuned for more updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+