హోండా డ్రీమ్ సిరీస్‌లో మరో సరికొత్త మోటార్‌సైకిల్
హోండా ప్రవేశపెట్టిన బడ్జెట్ మోటార్‌సైకిళ్లు హోండా డ్రీమ్ యుగ, డ్రీమ్ నియోలు మార్కెట్లో మంచి సక్సెస్‌ను సాధించడంతో కంపెనీ ఈ సిరీస్‌లో మరో సరికొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనుంది. ఈ ఏడాది మధ్య భాగం నాటికి ఓ కొత్త డ్రీమ్ సిరీస్ బైక్ రానుంది.
ప్రస్తుతం హోండా అందిస్తున్న డ్రీమ్ యుగ మరియు డ్రీమ్ నియో మోటార్‌సైకిళ్ల ఎగువన ఈ కొత్త మోటార్‌సైకిల్‌ను ప్రవేశపెట్టనున్నారు. కొత్త డ్రీమ్ సిరీస్ బైక్‌లో రీఫైన్ చేయబడిన 109సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎస్ఐ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు.

ఈ ఇంజన్ గరిష్టంగా 8.25 పిఎస్‌ల శక్తిని, 8.63 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం లభిస్తున్న డ్రీమ్ సిరీస్ బైక్‌ల మాదిరిగానే కొత్తగా రానున్న ఈ డ్రీమ్ సిరీస్ బైక్ కూడా అదే రకమైన స్టైల్‌ను కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇతర డ్రీమ్ సిరీస్ బైక్‌ల మాదిరిగానే ఇది కూడా మెరుగైన మైలేజీని ఆఫర్ చేయనుంది. ఇంకా, ఇందులో స్టయిలిష్ బాడీ గ్రాఫిక్స్, అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్స్, ఆప్షనల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ప్రీమియం ఫీచర్లు లభ్యం కానున్నాయి.
హోండా నుంచి రానున్న ఈ కొత్త డ్రీమ్ సిరీస్ బైక్ ధర రూ.50,000 నుంచి రూ.55,000 మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








