హోండా యునికార్న్ 160; ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

By Ravi

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ), యునికార్న్ బ్రాండ్‌లో ఓ కొత్త 160సీసీ వేరియంట్‌ను నిన్న (డిసెంబర్ 18, 2014) మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. యునికార్న్ మోడల్‌లో కస్టమర్లు ఎప్పటి నుంచో అప్‌డేటెడ్ వెర్షన్‌ను కోరుకుంటున్నారు. వారి కోరిక మేరకే హోండా ఈ కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది.

హోండా సిబి యునికార్న్ 150 డిజైన్ కన్నా హోండా సిబి యునికార్న్ 160 మోడల్ ఎంతో స్టయిలిష్‌గా అనిపిస్తుంది. ఇంకా ఇందులో పలు ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి. అవేంటే ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

దేశీయ విపణిలో హోండా సిబి యునికార్న్ 160 రెండు వేరియంట్లలో (స్టాండర్డ్, సిబిఎస్ - కాంబి బ్రేకింగ్ సిస్టమ్) లభ్యం కానుంది. వాటి ధరలు ఇలా ఉన్నాయి:
* సిబి యునికార్న్ 160 (స్టాండర్డ్) - రూ.69,350
* సిబి యునికార్న్ 160 (సిబిఎస్) - రూ.74,414

(రెండు ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

హోండా యునికార్న్ 160 ఫీచర్లు

తర్వాతి స్లైడ్‌లలో హోండా సిబి యునికార్న్ 160 మోడల్‌కి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోండి.

డిజిటల్ డిస్‌ప్లే

డిజిటల్ డిస్‌ప్లే

హోండా సిబి యునికార్న్ 160 డిజిటల్ డిస్‌ప్లేతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో లభిస్తుంది. ఆరెంజ్ బ్యాక్‌లైట్‌తో కూడిన ఈ డిస్‌ప్లేలో స్పీడ్, క్లాక్, ఫ్యూయెల్, ఆర్‌పిఎమ్ మొదలైన అంశాలను తెలుసుకోవచ్చు.

ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్

ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్

ఈ కొత్త యునికార్న్‌లోని ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్ విశిష్టంగా ఉంటుంది. ఈ ఫ్యూయెల్ ట్యాంక్‌పై అధనపు బాడీ ప్యానెల్స్ ఉంటాయి. ఈ ప్యానెల్స్‌పై 3డి హోండా యాంబ్లం కూడా ఉంటుంది. ఈ ప్యానెల్స్ బైక్‌కి స్టయిలిష్ లుక్‌ని ఇవ్వటమే కాకుండా, ఏరోడైనమిక్స్‌ని మెరుగుపరచడంలో కూడా సహకరిస్తాయి.

ఎల్ఈడి టెయిల్ ల్యాంప్

ఎల్ఈడి టెయిల్ ల్యాంప్

హోండా యునికార్స్ 160లోని టెయిల్ ల్యాంప్ ఎల్ఈడి లైట్లతో లభిస్తుంది. ఇది హెచ్ ఆకారంలో ఉండి బైక్‌కు మరింత అందమైన లుక్‌నిస్తుంది.

బ్రేక్స్

బ్రేక్స్

ఇందులో కొత్తగా కాంబి బ్రేక్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు. ముందు వైపు 240 మి.మీ. డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు డ్రమ్ బ్రేక్ ఉంటుంది. సిబిఎస్ వేరియంట్‌లో ఫ్రంట్ బ్రేక్ లేదా రియర్ బ్రేక్‌ను అప్లయ్ చేసినప్పుడు రెండు బ్రేకులు అప్లయ్ అవుతాయి.

సస్పెన్షన్

సస్పెన్షన్

ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను, వెనుక వైపు స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ మోనోషాక్ సస్పెన్షన్‌ను ఆఫర్ చేస్తున్నారు.

ఇంజన్, హెచ్ఈటి

ఇంజన్, హెచ్ఈటి

ఇందులో హెచ్ఈటి (హోండా ఈకో టెక్నాలజీ)తో అభివృద్ధి చేసిన కొత్త 162.71సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్‌కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. హోండా ఈకో టెక్నాలజీ వలన మెరుగైన మైలేజీని పొందవచ్చని కంపెనీ తెలిపింది.

ఇంజన్ పెర్ఫార్మెన్స్, గేర్‌బాక్స్

ఇంజన్ పెర్ఫార్మెన్స్, గేర్‌బాక్స్

ఈ ఇంజన్ గరిష్టంగా 8000 ఆర్‌పిఎమ్ వద్ద 14.5 బిహెచ్‌పిల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 14.61 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

మైలేజ్

మైలేజ్

కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం, హోండా సిబి యునికార్న్ 160 లీటరుకు 62 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

పెరల్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, జీనీ గ్రే మెటాలిక్, సన్‌బీమ్ వైట్ అనే నాలుగు ఆకర్షనీయమైన రంగులలో యునికార్న్ 160 లభిస్తుంది.

ధరలు

ధరలు

* సిబి యునికార్న్ 160 (స్టాండర్డ్) - రూ.69,350

* సిబి యునికార్న్ 160 (సిబిఎస్) - రూ.74,414

(రెండు ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Friday, December 19, 2014, 11:50 [IST]
English summary
Honda Motorcycle and Scooters India (HMSI) has launched the much-awaited Unicorn 160 in two variants. The CB Unicorn 160 standard is priced at Rs 69,350 and the CB Unicorn 160 CBS (Combi-Brake system) is priced at Rs 74,414 (all prices ex-showroom, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+